Representational Image (Photo Credits: File Image)

Neemuch, Sep 26: మధ్య ప్రదేశ్‌లో దారుణ ఘటన (Madhya Pradesh Shocker) చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్‌(30)పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ అకృత్యాన్ని వీడియో తీశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ జిల్లాలో (Woman constable gang-raped in Neemuch) చోటుచేసుకుంది. ఈ నెల మొదటి వారంలో ఘటన చోటుచేసుకోగా బాధితురాలు 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలితో నిందితుడు ఏప్రిల్‌ నుంచి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం కొనసాగిస్తున్నాడు. తన సోదరుడి బర్త్‌డే పార్టీకి ఆహ్వానించగా బాధితురాలు వెళ్లింది. అక్కడే ఆమెపై ప్రధాన నిందితుడు, అతడి సోదరుడు, మరొకరు అత్యాచారానికి ( Woman constable gang-raped) పాల్పడ్డారు. అయిదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని, అతడి తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక తెలంగాణలో సైదాబాద్ పరిధి పూసల బస్తీలో దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో భార్యాభర్తలు పసికందును బలిచేశారు దంపతుల మధ్య తలెత్తిన గొడవ కాస్త పసికందు ప్రాణం తీసింది. బాలింత అయిన భార్య, రోజుల శిశువుపై నిందితుడు రాజు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో 22 రోజుల శిశువుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. పోలీసులు పసికందు తల్లిదండ్రులైన రాజేష్‌ అలియాస్‌ రాజు, జాహ్నవిలను అదుపులోకి తీసుకున్నారు.

తాగుడుకు డబ్బులు ఇవ్వనన్న నానమ్మ, ఆగ్రహంతో అట్ల పెనంతో ఆమెను చంపేసిన మనవడు, తమిళనాడులో దారుణ ఘటన

రాజేశ్‌, జాహ్నవి దంపతులకు ఈ శిశువు రెండో సంతానం. రెండేళ్ల క్రితం ఈ దంపతులు వారి తొలి సంతానం.. ఐదు నెలల బాబును మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి విసిరేశారు. విషయం తెలుసుకున్న అధికారులు బాలుడిని కాపాడి.. అతడి సంరక్షణ కోసం యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌ చేర్చారు. రెండో సంతానం కూడా వీరి ఘర్షణకు బలైన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పసికందు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.