Truck (Representational Image/ Photo Credits: Wikimedia Commons)

Bhopal, May 1: ఓవైపు దేశ‌మంతా క‌రోనా వ్యాక్సిన్ కొర‌త‌తో అల్లాడిపోతుంటే.. మధ్య ప్రదేశ్‌లో ల‌క్ష‌ల కొద్దీ డోసుల వ్యాక్సిన్‌ను (Truck Carrying 2.40 Lakh Doses of COVID-19 Vaccine) రోడ్డు ప‌క్క‌న వ‌దిలేసి వెళ్ల‌ారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని న‌ర్సింగ్‌పూర్ జిల్లాలోని క‌రేలీ బ‌స్టాండ్ ద‌గ్గ‌ర సుమారు 2.4 లక్ష‌ల కొవాగ్జిన్ డోసులు (Covaxin Worth Rs 8 Crore Abandoned for 12 Hours) ఉన్న ట్ర‌క్‌ను ఎవ‌రో వ‌దిలేసి వెళ్లారు. ఆ ట్ర‌క్ చాలా సేప‌టి నుంచి అక్క‌డే ఉండ‌టం గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. క‌రేలీ పోలీసులు వ‌చ్చి చూడ‌గా.. అందులో క‌రోనా వ్యాక్సిన్‌ను గుర్తించారు.

అయితే అందులో డ్రైవ‌ర్‌, క్లీనర్‌ ఎవ‌రూ లేరు. ఈ వ్యాక్సిన్ల మొత్తం ఖరీదు రూ. 8 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని క‌రేసీ ఎస్ఐ ఆశిష్ బొపాచె వెల్ల‌డించారు. డ్రైవ‌ర్ ఫోన్ నంబ‌ర్ తెలుసుకొని ట్రేస్ చేయ‌గా.. అత‌ని ఫోన్ రోడ్డు ప‌క్క‌న పొద‌ల్లో దొరికిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ట్ర‌క్‌లో ఏసీ ప‌ని చేస్తోంద‌ని, దానిని బ‌ట్టి వ్యాక్సిన్ల‌న్నీ బాగానే ఉన్న‌ట్లు గుర్తించామ‌ని తెలిపారు. డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ కోసం తాము ఇంకా వెతుకున్న‌ట్లు చెప్పారు.

లాక్‌డౌన్ వార్తలను నమ్మకండి, మే 3వ తేదీ నుంచి మే 20 వరకు దేశంలో పూర్తి లాక్‌డౌన్‌ అనే వార్త ఫేక్, స్పష్టత నిచ్చిన పీఐబీ, క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కేంద్రం ఆదేశాలు

దేశంలో నిన్న‌ కొత్త‌గా 4,01,993 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 2,99,988 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 1,91,64,969కు చేరింది.

కేసులు తగ్గాలంటే లాక్‌డౌన్ ఒక్కటే మార్గం, కొన్ని వారాల పాటు షట్‌డౌన్‌ చేయాల‌ని స‌ల‌హా ఇచ్చిన డాక్ట‌ర్ అంథోనీ ఎస్ ఫౌచీ, ఇప్పటివరకు రాష్ట్రాలకు 16.37 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఉచితంగా ఇచ్చామని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ

గడచిన 24 గంట‌ల సమయంలో 3,523 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,11,853 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,56,84,406 మంది కోలుకున్నారు. 32,68,710 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,49,89,635 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 28,83,37,385 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,45,299 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.