మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే వర్గం, బీజీపీ వర్గం మధ్య కాల్పులు చోటు చేసుకున్నది. ఉల్హాస్‌నగర్ పోలీస్ స్టేషన్లో శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ తుపాకితో కాల్పులు జరిపాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్ గైక్వాడ్‌ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.కాల్పులకు పాల్పడ్డ ఎమ్మెల్యే గణ్‌పత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన పోలీస్ స్టేషన్లో జరగడం షాకింగ్ కు గురి చేస్తోంది. ఓ భూమికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈఘటన జరిగినట్లు సమాచారం.
కాల్పులపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు. తన కొడుకుని కళ్లెదుటే పోలీసు స్టేషన్‌లో కొడుతుంటే చూసి తట్టుకోలేకపోయానని.. అందుకే కాల్పులు జరిపినట్టు నిందితుడు తెలిపారు.కాల్పుల అనంతరం గణ్‌పత్ గైక్వాడ్ నుంచి పోలీసులు గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గణ్‌పత్ గైక్వాడ్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీస్‌స్టేషన్‌లో హాజరుపరుచగా.. జిల్లా కోర్టు ఈ నెల 14 వరకు రిమాండ్ విధించింది.
Here's Shoot Video
A #BJP MLA and his bodyguard discharged 10 rounds within the confines of the Hill Line Police Station cabin, targeting a senior inspector. The incident resulted in a Shiv Sena leader sustaining six bullet wounds. #Maharashtra #ShivSena pic.twitter.com/5BW5cFL7Rw
— Sneha Mordani (@snehamordani) February 3, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)