Mumbai, June22: ఫేక్ మేసేజ్ లతో జాగ్రత్త అని సైబర్ నిపుణులు చెబుతున్నా చాలామంది మోసపోతున్నారు. తాజాగా ముంబైలో ఓ డాక్టర్ హ్యాకర్ల చేతిలో మోసపోయాడు. ఫేక్ మెసేజ్ ఓపెన్ చేయడం ద్వారా ఏకంగా రూ.48500 పోగొట్టుకున్నాడు. షాకింగ్ ఘటన వివరాల్లోకెళితే.. ముంబైలోని తిలక్ నగర్ లో పనిచేస్తున్న డాక్టర్ కు ఉదయాన్నే నిద్రలేచేసరికి ఒక మెసేజ్ వచ్చింది.‘‘మీరు కరెంట్ బిల్లు కట్టలేదు.
ఈ రోజు కూడా బిల్లు కట్టకపోతే సాయంత్రం 9.30 తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయబడుతుంది’’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దాంతో షాకైన ఆయన.. డాక్టర్‌గా పనిచేస్తున్న తన కూతురికి మెసేజ్ చూపించాడు.దాంతో బిల్లు (fake electricity bill) నిజంగానే కట్టలేదని అనుకున్న ఆమె కరెంట్ బిల్లు కట్టింది. ఆ తర్వాత చూస్తే ఆమె ఖాతాలో నుంచి ఏకంగా రూ.48500 పోయినట్లు (Mumbai Doctor loses Rs 48k) ఆమెకు అర్థమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కోపర్‌కు చెందిన బాధితురాలు.. తండ్రి ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూసి కంగారు పడింది. వెంటనే కరెంట్ బిల్లు కట్టేయడానికి ప్రయత్నించింది. మెసేజ్‌లో ఉన్న ‘‘ఎలక్ట్రిసిటీ ఆఫీసర్’’ నెంబరుకు కాల్ చేసింది. అతను ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకొని పేమెంట్ చేయాలని చెప్పాడు. తండ్రి ఫోన్‌లో అలా చేయడం కుదరలేదు. దాంతో తన మొబైల్‌లోనే ఆమె ఆ యాప్ డౌన్‌లోడ్ చేసింది. ఆ తర్వాతే తను మోసపోయినట్లు తెలుసుకుందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.