Maharashtra: జలగావ్‌ జిల్లాలో దారుణం, వాడేసిన మాస్కులతో పరుపుల తయారీ, ఈనెల 15 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా మహారాష్ట్ర, కరోనాతో కన్నుమూసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే పాస్కల్ ధనారే, రాష్ట్రంలో బోర్డు ఎగ్జామ్స్‌ వాయిదా
Face Masks (Photo Credits: Wikimedia Commons)

Mumbai, April 12: మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో జలగావ్‌ జిల్లాలో వాడేసిన మాస్క్‌లతో పరుపులు తయారు చేస్తూ ప్రజల జీవితాలో చెలగాటమాడుతున్నారు. అక్కడి వ్యాపారులు పరుపుల తయారిలో కాటన్‌, ఇతర పదార్థాల బదులు వాడేసిన మాస్క్‌లు వినియోగిస్తున్నట్లు (Police Bust Factory Stuffing Mattresses with Used Masks) పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు రైడ్‌ చేయగా.. ఈ ప్రాంతంలో ఉన్న వాడేసిన మాస్క్‌ గుట్టలను (Maharashtra Mattress Centre) చూసి పోలీసులు షాకయ్యారు.

అనంతరం ఆ మాస్కల్‌ను తగులబెట్టి.. సదరు కంపెనీ యజమాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వాడేసిన మాస్క్‌ను తాకాలంటేనే జనాలు భయంతో వణికిపోతున్న తరుణంలో.. ఇలా ఏకంగా వాటితో పరుపులు తయారు చేయడం మరింత భయపెడుతుంది. వీటిలో ఎవరైనా కరోనా రోగి వాడేసిన మాస్క్‌ ఉంటే ఏంటి పరిస్థితి అని అక్కడి వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కక్కుర్తి వ్యాపారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు అనుమతి, టీకాను ఉత్పత్తి చేసి విక్రయించనున్న డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీ, అత్యవసర వినియోగానికి సిఫార్సు చేసిన కేంద్ర నిపుణుల కమిటీ

ఇక వైద్య అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో అవాంతరాలతో ఇద్దరు రోగులు మరణించారు. సాంకేతిక కారణాలతో ఆస్పత్రి అంతటా ఆక్సిజన్‌ సరఫరాలో అవాంతరాలు ఏర్పడ్డాయి. సమస్యను పరిష్కరించాలని రోగుల బంధువులు ఆస్పత్రి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినా పరిస్ధితిని చక్కదిద్దడంలో జాప్యంతో ఇద్దరు రోగులు మరణించారు. మరోవైపు కొవిడ్‌-19 తీవ్రతతో మహారాష్ట్రలో పదిహేను రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్‌ విధించేందుకు కసరత్తు సాగుతోంది. ఈనెల 15 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ వర్తింపచేయవచ్చని భావిస్తున్నారు.

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి బీజేపీ మాజీ ఎమ్మెల్యే పాస్కల్ ధనారే (49) కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ ఉద‌యం ఆయ‌న‌ తుదిశ్వాస విడిచారు. పాస్క‌ల్ ధనారేకు కొద్ది రోజుల క్రితం క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో ఆయ‌న గుజరాత్ రాష్ట్రం వ్యాపి ప‌ట్ట‌ణంలోని ఓ ఆస్ప‌త్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించ‌డంతో మెరుగైన చికిత్స కోసం ఆదివారం రాత్రి ముంబై ఆస్ప‌త్రికి తరలించారు. అయినా ఫలితం లేక‌పోవడంతో సోమవారం తెల్లవారుజామున ధనారే మరణించారు. మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘర్ జిల్లా, దహనుకు చెందిన ఆయన 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ధనారేకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

కరోనా సెకండ్ వేవ్..డేంజర్ జోన్‌లో ఇండియా, బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేసి రెండవ స్థానంలోకి, దేశంలో 1.35 కోట్లకు చేరుకున్న మొత్తం కేసులు సంఖ్య, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌ ఎగుమతిపై నిషేధం

రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు కల్లోలం సృష్టిస్తుండడంతో లాక్‌డౌన్‌పై సమాలోచనలు చేస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండడంతో 10, 12వ తరగతి స్టేట్ బోర్డు ఎగ్జామ్స్‌ను వాయిదా వేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. మేలో పదో తరగతి, జూన్‌లో 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు పరీక్షలు నిర్వహించేందుకు అనువుగా లేవన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, సాంకేతిక దిగ్గజాలను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వివరించారు.