Representative Image

Mumbai, Jan 28: మహారాష్ట్రలో కొత్తగా మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు మహిమలు ఉన్నాయని ఇంట్లోని దుష్టశక్తులను తరిమికొడతానని ఓ దొంగ స్వామీ (Self-Styled Godman) ఒక మహిళను రూ. 32 లక్షలు మోసం మేర చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడు ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన బాబాన్ బాబూరావు పాటిల్‌ను పోలీసులు గర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వ ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని వాటిని తరిమివేసే శక్తి (Driving Away Evil Spirits) తనకు ఉందని ఆ దొంగ స్వామి నమ్మించాడు. అయితే బాబా మోసాన్ని గ్రహించలేని ఆ మహిళ 2019 డిసెంబర్ నుంచి నిందితుడుకి పలు మార్లు డబ్బులు ఇచ్చింది. ఈ రకంగా పాటిల్ ఆమె నుంచి మొత్తం రూ.31.60 లక్షలతో (Dupes Her of Rs 32 Lakh) పాటు కొన్ని ఖరీదైన వస్తువులను తీసుకున్నాడు.

భూవివాదం, కర్నూలులో ఇద్దరిని వేట కొడవళ్లతో నరికి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రత్యర్థులు

అయితే ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా తను ఇంట్లో సమస్యలు పరిష్కారం కాకపోయే సరికి ఆ మహిళ దొంగ బాబా అసలు స్వరూపం తెలుసుకుని మోసపోయానని గ్రహించింది. దీంతో సమీప పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి జరిగినదంతా చెప్పి పాటిల్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడుని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.