Crime | Representational Image (Photo Credits: Pixabay)

Mumbai, Sep 1: మహారాష్ట్రలోని థానేలో చిరు వ్యాపారులు బీభత్సం సృష్టించారు. అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారిని ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అసిస్టెంట్​ పోలీసు కమిషనర్ కల్పితా పింపుల్​​ చేతి మూడు వేళ్లు (Woman Civic Official Loses 3 Fingers) తెగిపడిపోయాయి. దారుణ ఘటన వివరాల్లోకెళితే..రోడ్లు, ఫుట్‌పాత్‌లపై అక్రమంగా దుకాణాలు ఏర్పరుచుకున్న వీధి వ్యాపారులపై ఠాణె మున్సిపల్​ కార్పొరేషన్​ చర్యలు చేపట్టింది.

మున్సిపల్​ కమిషనర్​ డాక్టర్​ విపిన్ శర్మ ఆదేశాలతో దుకాణాలను, తోపుడు బండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘోడ్​బందర్​ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇదే తరహాలో వ్యాపారులను ఖాళీ చేయించడానికి అధికారులు చేరుకోగా అక్కడ ఘర్షణ తలెత్తింది.ఈ క్రమంలో ఏసీపీపై కూరగాయల వ్యాపారి అమర్జీత్​ యాదవ్​ కత్తితో దాడి చేశాడు. దీంతో కల్పితా పింపుల్​ మూడు వేళ్లు (Thane civic official loses fingers) తెగిపడ్డాయి. ఆమె తలకు కూడా గాయాలయ్యాయి.

పానీపూరి తెచ్చిన భర్త, నన్ను అడక్కుండా ఎందుకు తెచ్చావని భార్య ఆత్మహత్య, పుణేలో విషాద ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

చికిత్స నిమిత్తం ఆమెను హుటాహుటిన ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీతోపాటు ఉన్న సెక్యూరీటీ గార్డు కూడా తీవ్రంగా (Thane official loses 3 fingers) గాయపడ్డాడు. దాడి కేసులో నిందితుడు అమర్జీత్​​ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై హత్యాయత్నం కేసు సహా ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడన్న అభియోగం కింద కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్​ వినయ్​ రాఠోడ్​ పేర్కొన్నారు.