Image used for representational purpose (Photo Credits: Pixabay)

Lucknow, OCT 19: తన భార్యతో అన్నకు వివాహేతర సంబంధం (Affair) ఉందని అనుమానించిన తమ్ముడు అన్నను కొట్టి చంపాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ (Uttarapradesh), ఘజియాబాద్‌ పరిధిలోని ముకింపూర్ (Mukhimpur) గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బబ్లూ కుమార్, అర్జున్ కుమార్ అన్నదమ్ములు. బబ్లూ కుమార్ కూలీగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడు. ఆదివారం రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం బబ్లూ (Bablu) ఇంటికి వెళ్లి, తన అన్నతో వివాహేతర సంబంధం (Affair) గురించి భార్యను ప్రశ్నించాడు. ఆమెతో గొడవపడ్డాడు. అప్పుడే అక్కడికి చేరుకున్న అర్జున్ కమార్ కూడా ఈ విషయంపై బబ్లూతో గొడవకు దిగాడు.

UP Shocker: యూపీలో ఘోరం, యువతి అరుస్తున్నా తలపై కొడుతూ మీద పడి దారుణంగా అత్యాచారం, కామాంధులు పక్కనుంచి వెళుతున్నా పట్టించుకోని పోలీసులు 

దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. గొడవ పెరిగింది. ఒకరినొకరు కొట్టుకుంటూ ఇంట్లోని కిచెన్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడున్న ఫ్రయింగ్ పాన్‌తో అన్న బబ్లూ కుమార్ తలపై గట్టిగా కొట్టాడు అర్జున్ కుమార్. బబ్లూ స్పృహతప్పిపడిపోయే వరకు బాదుతూనే ఉన్నాడు. దీంతో బబ్లూ అక్కడే కూలిపోయాడు. వెంటనే అర్జున్ కుమార్ అక్కడ్నుంచి పారిపోయాడు.

Bihar Viral Video: వాటిని వీడియో తీసినందుకు గదిలో వేసి యువకులను చితకబాదిన నర్సులు, యువకులనే సపోర్ట్ చేస్తున్న నెటిజన్లు, ఇంకా కేసు నమోదు చేయని పోలీసులు, బీహార్‌ లో వైరల్‌గా మారిన వీడియో 

వెళ్తూ వెళ్తూ స్థానికులకు విషయం చెప్పాడు. తన అన్న మద్యం తాగి, గోడకు తగిలి కింద పడిపోయాడని చెప్పి వెళ్లిపోయాడు. వెంటనే వాళ్లు ఘటనా స్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బబ్లూ కుమార్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే బబ్లూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అర్జున్ కుమార్‌ను అరెస్టు చేశారు.