Screen garb from viral video

Patna, OCT 19: బీహార్‌ రాష్ట్రం ఛప్రాలోని ఓ ఆసుపత్రి గదిలో ఇద్దరు యువకులను బంధించి నర్సులు (Nurses) కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయింది. ప్రత్యక్ష సాక్షులు దానిని చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారని నివేదికలు చెబుతున్నాయి. ఈ వీడియోలో ఓ నర్సు ఇద్దరు యువకులను కర్రతో కొడుతుండగా, మరొకరు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నట్లు కనిపించింది. యువకులిద్దరూ వదిలేయమని ప్రాధేయపడుతున్నారు, కానీ నర్సులు (Nurses) వారిని కొడుతూనే ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇద్దరు యువకులు మెడికల్ సర్టిఫికేట్‌కోసం ఛప్రాలోని (Chhapra) సదర్ ఆసుపత్రికి వచ్చారు. అయితే, ఆసుపత్రిలో కనిపించే లోపాలను ఫోన్ లలో చిత్రీకరించడం ప్రారంభించారు. దీంతో ఆరోగ్య కార్యకర్తలు, నర్సులు వారిని వీడియోలు తీయొద్దంటూ వారించారు. అయినా వినకపోవటంతో ఆసుపత్రి సిబ్బంది ఇద్దరినీ పట్టుకుని ఓ గదిలోనిర్బంధించి చితకబాదారు. ఈ విషయమై సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ సాగర్‌ దులాల్‌ సిన్హా మాట్లాడుతూ.. ఈ ఘటనపై మీడియా ప్రతినిధుల నుంచి సమాచారం అందిందని తెలిపారు.

అయితే, సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ జోక్యంతో వారిని విడుదల చేసినట్లు తెలిసింది. ఆసుపత్రి వర్గాల వివరణ ప్రకారం.. ఇద్దరు యువకులు స్టాఫ్ రూమ్‌లో కూర్చున్న నర్సును వీడియో తీస్తున్నట్లు గుర్తించడంతో వారిని బంధించినట్లు పేర్కొంటున్నారు. వీడియో డిలీట్ (Video delete) చేయమన్నా చేయలేదని, దీంతో ఆ ఇద్దరు యువకులను రూంలో వేసి కొట్టినట్లు తెలిసింది. చివరికి యువకులు క్షమాపణలు చెప్పడంతో వారిని విడుదల చేశారు.

UP Shocker: యూపీలో ఘోరం, యువతి అరుస్తున్నా తలపై కొడుతూ మీద పడి దారుణంగా అత్యాచారం, కామాంధులు పక్కనుంచి వెళుతున్నా పట్టించుకోని పోలీసులు 

ఈ ఘటనలోపై పోలీస్ కేసు నమోదు కాలేదు. వీడియో వైరల్ (Video viral) కావడంతో కొందరు నెటిజన్లు బీహార్ ఆరోగ్య శాఖకు ఈ వీడియోను ట్యాగ్ చేశారు. యువకులను కొట్టినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో, కొంతమంది నెటిజన్లు యువకులు దురుసుగా ప్రవర్తించారని నర్సుల తీరు సరైనదేనంటూ ప్రతిస్పందిస్తున్నారు.