New Delhi, July 29: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Human Resource and Development ) పేరులో మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (Ministry of Education) గా మార్చనుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్‌ఆర్డీ) శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనను బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాఫెల్‌కు వాటర్ సెల్యూట్, అంబాలా ఎయిర్ బేస్‌లో ల్యాండ్ కానున్న రాఫెల్ యుద్ధ విమానాలు, రిసీవ్ చేసుకునేందుకు అంబాలా చేరుకున్న వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా
ఇస్రో మాజీ చీఫ్ కే కస్తూరిరంగన్ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ తొలుత మంత్రిత్వ శాఖ పేరు మార్చాలని సిఫార్సు చేసింది. నూతన విద్యా విధానం డ్రాఫ్ట్‌లో ఇది కీలక సిఫార్సు కావడంతో పేరు మార్పునకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. విద్య, బోధన, సాధన ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించే దిశగా హెచ్‌ఆర్డీ శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చాలని ఈ కమిటీ సూచించింది. జాతీయ విద్యా విధానానికీ కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తొలుత కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేరుతోనే వ్యవహారాలు నడిచేవి. అయితే విద్యారంగంలో సమూలంగా మార్పులు చేసే దిశలో… నాడు ఆ శాఖ మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను.. మానవ వనరుల మంత్రిత్వ శాఖగా మార్చారు. మళ్లీ అదే పేరుతో ఇప్పుడు కార్యకలాపాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.