
Thiruvananthapuram, October 22 : ఇన్నిరోజుల పాటు ఉత్తర భారతాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు మళ్ళీ ఇప్పుడు దిశ మార్చుకొని దక్షిణ భారత దేశానికి వస్తున్నాయి. రుతుపవనాల తిరోగమనం కారణంగా కేరళ, కర్ణాటక, తమిళనాడుల రాష్ట్రాలలో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలంటూ భారత వాతావరణ శాఖ (IMD - India Meteorological Department) మంగళవారం హెచ్చరికలు చేసింది. కర్ణాటక, కేరళ మరియు మాహే ప్రాంతాలలో కోస్తా తీర ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్ష ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి సమాచారం. కోస్తా తీర (Coastal Andhra) ప్రాంతాలకు సమీపంలో ఉండే యానాం, పుదుచ్చేరి మరియు కరైకల్ ప్రదేశాలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. మొన్నటివరకు హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని ముంచేసిన భారీ వర్షాలు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వస్తున్నాయి. ఆదివారం రోజు కూడా నగరంలోని చాలా చోట్ల 44 mm వర్షపాతం నమోదైంది. అక్టోబర్ 24 వరకు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షంలో తడిసారా? మీ జుట్టుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే గతంలో నాకు కూడా జుట్టు ఉండేది అని చెప్పుకోవాల్సి వస్తుంది.
ఇప్పటికే దక్షిణ కర్ణాటకలోని కొడగు మరియు మైసూరు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడ్డాయి. కాగా, తీరప్రాంత కర్ణాటకకు బుధవారం వరకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. కేరళలోని నాలుగు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ మంగళవారం వరకు రెడ్ అలర్ట్ జారీ చేయబడినట్లు తెలుస్తుంది. కేరళలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఏపీ, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలకు అలర్ట్స్
భారీ వర్షపాతం నేపథ్యంలో, తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అధికారులు ఈ రోజు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం ఉంటుందని ఐఎండి అంచనా వేసింది. పతనమిట్టి జిల్లాలోని తుంపమోన్ వద్ద పంబా నది మరియు కేరళలోని త్రిచూర్ జిల్లాలోని పాలకడవు వద్ద కావేరి నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా, బెల్గాం జిల్లాలోని గోకక్ జలపాతం వద్ద ఘాట్‌ప్రభా నది, కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని నావల్‌గుండ్ వద్ద కృష్ణ నది కూడా ప్రమాద స్థాయులకు మించి ప్రవహిస్తున్నాయి.
బెలగావిలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు 58.1 మి.మీ భారీ వర్షపాతం నమోదైంది. మత్స్యకారులు కూడా సముద్రంలోకి ప్రవేశించవద్దని సూచించారు. విదర్భ, ఛత్తీస్‌ఘర్, జార్ఖండ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, తూర్పు అస్సాం, నాగాలాండ్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ, ఉత్తర తెలంగాణ, కొంకణ్, గోవా ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సూచన సంస్థ అంచనా వేసింది.