Orange Alert In Kerala: ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలతో కుదేలవుతున్న కేరళ, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఏపీ, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలకు అలర్ట్ మెసేజ్
IMD issues Orange alert for 12 districts of Kerala for two days (Photo-ANI)

Thiruvananthapuram, October 21: ఉపరితల ద్రోణి ఏర్పడడంతో రానున్న రెండు రోజుల పాటు కేరళలో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతోభారత వాతావరణ శాఖ కేరళలోని 13 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొల్లాం, అలపూజ, కొట్టాం, ఇడుక్కి, ఎర్నాకులం, పాలక్కడ్‌, త్రిసూర్‌, మల్లాపురం, వయనాడ్‌, కోజికోడ్‌, కన్నూర్‌, కాసర్‌ఘడ్‌, పాతనామ్‌ తిట్టా జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రానున్న రెండు రోజుల పాటు ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కాగా కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు ధాటికి రోడ్లపై నీరు నిలిచి నదులను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొచ్చిలోని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించింది.

భారీ వర్షాలతో కుదేల్

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేందుకు ఓటర్లు నానా తంటాలు పడుతున్నారు. ఇంకా కేరళలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. అక్కడ వర్షాలు దెబ్బకి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కేరళలో 9.7లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. తిరువనంతపురంలోని వట్టియూర్కావు, అళప్పుజలోని ఆరూర్‌, పత్నంతిట్టతో పాటు ఎర్నాకుళం, మాంజేశ్వరం స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మాంజేశ్వరం మినహా నాలుగు స్థానాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

స్కూళ్లకు సెలవు 

ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణశాఖ తెలిపింది. సముద్రంలో గంటకు 40-55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదువుతుందని తెలిపారు.

ఐఎండీ వెదర్ వార్నింగ్ 

తంజావూరు, నాగపట్నం, రామనాథపురం, శివగంగై, పుదుక్కోట, అరియలూరు, పెరంబలూరు, కోవై, తేని, నీలగిరి, కన్నియకుమారి, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి తుపానుగా మారే అవకాశం కూడా వుందని అధికారులు హెచ్చరించారు. శ్రీలంక తీరం సమీపంలోని నైరుతి బంగాళాఖాతం నుంచి కోస్తా వరకు ద్రోణి కొనసాగుతుందని, దీంతో సముద్రం మీదుగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్నారు.దీని ప్రభావంతో మరో మూడు రోజులు తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తాయని తెలిపారు.