MP Veerendra Kumar Passes away: ఎంపీ వీరేంద్ర కుమార్ కన్నుమూత, కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసిన మాతృభూమి మేనేజింగ్‌ డైర్టెక్టర్‌, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
MP Veerendra Kumar (Photo Credits: ANI)

Kozhikode, May 29: రాజ్యసభ ఎంపీ, ప్రముఖ మలయాళ దినపత్రిక మాతృభూమి మేనేజింగ్‌ డైర్టెక్టర్‌ వీరేంద్ర కుమార్‌ (MP Veerendra Kumar Passes away) గురువారం కన్నుమూశారు. గత రాత్రి 8.30 గంటలకు కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కార్డియాక్‌ అరెస్ట్‌తో (cardiac arrest) ఆయన మరణించారు. వీరేంద్రకుమార్‌కు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈయన రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో​, మీడియా రంగంలో, సాహితీ ప్రపంచంలో ఇలా ప్రతీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. లాక్‌డౌన్ 5.0పై రంగంలోకి అమిత్ షా, లాక్‌డౌన్ పొడిగింపుపై రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తీసుకున్న హోంమంత్రి, మే 31న తుది నిర్ణయం

లోక్‌సభ సభ్యునిగా కేరళలోని కోజికోడ్‌ నుంచి రెండుసార్లు గెలిచిన వీరేంద్రకుమార్‌ కేంద్ర, రాష్ట్రాల్లో రెండింటిలోనూ మంత్రిగా పనిచేశారు. 2010లో తన ప్రయాణ కథనం హైమావత భోవిల్‌కు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. వీటితో పాటు తన సాహితీ రచనలకు కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు, 100కి పైగా అవార్డులను గెలుచుకున్నారు.

సోషలిస్ట్ నాయకుడైన వీరేంద్ర కుమార్ 1987– -91 మధ్య కేరళ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1996లో కోజికోడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. హెచ్​డీ దేవె గౌడ, ఐకే గుజ్రాల్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి అయ్యారు. 2004 లో మళ్లీ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2016 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 70 ఏళ్ల వయసులో మాతృభూమి దినపత్రికను స్థాపించి ఎండీగా పనిచేశారు. వీరేంద్ర కుమార్ తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్ర అంశాలపై పుస్తకాలు రాశారు. సాహిత్య అకాడమీ, కేరళ సాహిత్య అకాడమీల అవార్డులు పొందారు.

కాగా ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. 'పేదలకు, నిరుపేదల పక్షాన గొంతెత్తారని గుర్తుచేశారు. సమర్థవంతమైన శాసనసభ్యుడిగా, ఎంపీగా ఆయన మంచి గుర్తింపు పొందారంటూ' మోడీ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ కూడా వీరేంద్ర కుమార్ మృతికి సంతాపం ప్రకటించారు.