Assam Bomb Blasts: అస్సాంలో బాంబు పేలుళ్లు, ఉలిక్కిపడిన దేశం, గంటల వ్యవధిలో అస్సాంలో పలు చోట్ల బాంబు పేలుళ్లు, ఖండించిన ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌
Multiple Explosions In Assam On Republic Day; CM Sonowal Condemns terror On Sacred Day (Photo-ANI)

Guwahati, January 26: దేశమంతా 71వ రిపబ్లిక్ డే వేడుకలు (Republic Day) ఘనంగా జరుపుకుంటుంటే అస్సాం (Assam) బాంబుల మోతతో (Multiple Explosions) మారు మోగింది. దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం రోజున దాదాపు గంట వ్యవధిలో అసోంలో పలు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

దిబ్రుగర్‌లో రెండు ఎల్‌ఈడీ బ్లాస్ట్‌లు జరగగా.. సోనారి, దులియాజన్‌, దూమ్‌దూమా ప్రాంతాల్లో గ్రానేడ్‌ పేలుళ్లు జరిగాయని అధికారులు తెలిపారు. అయితే ఈ పేలుళ్లలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.

కశ్మీర్‌ జైషే చీఫ్‌ హతం

ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు పేలుడు శకలాలను సేకరించారు. చరైడియా జిల్లాలోని సోనారి ఘటనలో .. బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడ గ్రేనైడ్ ఉంచి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ పేలుళ్లు నిషేధిత తీవ్రవాద సంస్ధ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అసోం ఇండిపెండెంట్ కు చెందిన పనిగా పోలీసులు భావిస్తున్నారు. రిపబ్లిక్ వేడుకలను బహిష్కరించాలని ఈసంస్ధ శనివారం పిలుపు నిచ్చింది.

Here's ANI Tweet

 

గత కొన్ని సంవత్సరాలుగా ఈశాన్య భారతదేశంలోని పలు తీవ్ర వాద సంస్ధలు భారత గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని పిలుపునిస్తు వస్తున్నాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగుకుండా భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ ఈశాన్యభారతంలో ఉగ్రవాదులు నాలుగు చోట్ల గ్రనేడ్ లు పేల్చి కలకలం సృష్టించారు.

Here's ANI Tweet

అసోంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న బాంబు పేలుళ్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌ (CM Sonowal) ఖండించారు. ‘రిపబ్లిక్‌ డే రోజున బీభత్సం సృష్టించేందుకు ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనకు కారకులపై మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుద’ని ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు. నిషేధిత యూనైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అసోం ఈ పేలుళ్లుకు పాల్పడి ఉండోచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.