ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Mumbai Airport ) తన లగేజీ బ్యాగ్ (luggage)లో బాంబు ఉందంటూ ఎయిర్‌పోర్ట్ అధికారులను ఓ మహిళ భయబ్రాంతులకు గురిచేసింది. ముంబై నుంచి కోల్‌కతాకు వెళుతున్న మహిళ రెండు బ్యాగులతో విమానాశ్రయానికి వచ్చింది.అయితే, నిబంధనల ప్రకారం.. పరిమితికి మించి బ్యాగ్‌లో లగేజీ ఉండటంతో మరో బ్యాగ్‌కు అదనపు ఛార్జీలు చెల్లించాలని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది చెకింగ్ వద్ద ఆమెను కోరారు. అందుకు ఆమె నిరాకరించింది.
మళ్లీ కుప్పకూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం, కర్నాటకలో క్రాష్ అయిన కిరణ్ శిక్షణ విమానం, వీడియో ఇదిగో..
అంతటితో ఆగకుండా తన లగేజీలో బాంబు (bomb) ఉంది అంటూ అధికారులను భయాందోళనకు గురి చేసింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.. ఆమె బ్యాగ్‌ను స్కాన్ చేయగా ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదు. అనంతరం సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సహార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టైన కొద్దిసేపటికే ఆ మహిళను బెయిల్‌పై విడుదల చేశారు.