Mumbai Lawyer Satyadev Joshi Attacked (photo-Video Grab)

Mumbai, July 19: ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ స్థలం వివాదం విషయంలో వాదోపవాదనలు వినిపిస్తున్న న్యాయవాదిపై (Lawyer Satyadev Joshi Attacked) నడిరోడ్డు మీదే కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో మూకుమ్మడి దాడి చేశారు. కత్తులు, రాడ్లతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు.

పట్టపగలు నడిరోడ్డుపై 15- 20 మందికి పైగా దాడి చేయడంతో ఆ న్యాయవాది (Mumbai Lawyer Satyadev Joshi) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ న్యాయవాది (Mumbai Lawyer) ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advocate Madan J Gupta ట్వీట్ చేసిన వీడియో ప్రకారం...ముంబైకి చెందిన న్యాయవాది సత్యదేవ్‌ జోషి ఓ స్థలం వివాదంపై కేసు స్వీకరించారు. ప్రస్తుతం న్యాయస్థానంలో ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఆదివారం మధ్యాహ్నం కారులో తన సహాయకుడు అంకిత్‌ టాండన్‌తో కలిసి బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు న్యాయవాది కారును వెంబడించి పశ్చిమ ముంబైలోని దహిసర్‌ ప్రాంతంలో అడ్డగించారు.

రైతుల పాస్‌బుక్ కోసం లంచం అడిగిన బ్యాంక్‌ ఉద్యోగి, ఆవేశంతో చితకబాదిన రైతులు, ఉద్యోగిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపిన అవంతిపూర్ బడోడియా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌

కారు దిగిన తరువాత అతనిపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఏకంగా 14 మంది ఉండడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా ఆ ముఠా దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎంహెచ్‌బీ కాలనీ పోలీసులు విచారణ చేపట్టారు.

Here's Watch the video of the attack

నిందితులు బొరివలీకి చెందిన వారుగా గుర్తించారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అయితే న్యాయవాదిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి.