Representative Image

ప్రియురాలితో ఎంజాయ్ చేసిన తర్వాత ఓ వ్యక్తి తన భార్యకు ఆ విషయం తెలీకుండా ఉండేందుకు పెద్ద సాహసమే చేశాడు. ప్రియురాలితో కలిసి విదేశీ టూర్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేసిన ఈ వ్యక్తి, భార్యకు ఈ విషయం తెలియకుండా ఉండేందుకు ఏకంగా తన పాస్‌పోర్ట్‌లో పేజీలను (Man tears up passport pages) చించివేశాడు. చివరకు పాస్‌పోర్ట్‌ దుర్వినియోగం ఆరోపణలపై అతడు అరెస్టయ్యాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది.

32 ఏళ్ల ఇంజినీర్‌ ఒక ఎంఎన్‌సీలో పని చేస్తున్నాడు. ఆఫీస్‌ పనిమీద టూర్‌కు వెళ్తున్నట్లు భార్యకు చెప్పాడు. అయితే వివాహేతర సంబంధం ఉన్న మహిళతో కలిసి అతడు మాల్దీవులకు వెళ్లాడు. మరోవైపు భార్య ఆ వ్యక్తికి పలు మార్లు ఫోన్‌ చేసింది. అతడు మాట్లాడకపోవడంతో ఆమె అనుమానించింది. పలుసార్లు వాట్సాప్‌ కాల్స్‌ కూడా చేసింది. దీంతో ఆ వ్యక్తి తన టూర్‌ను కుదించుకున్నాడు. ఆఫీస్‌ పని మీద కాకుండా ప్రియురాలితో ఎంజాయ్‌ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి భార్యకు తెలియకూడదని ( hide Maldives trip from wife) భావించాడు.

హత్యకు ప్రతీకారం..క్షుద్రపూజలతో మహిళను చంపినందుకు మంత్రగాడిని సజీవ దహనం చేసిన గ్రామస్థులు, అస్సాంలో దారుణ ఘటన

పాస్‌పోర్ట్‌లో సంబంధిత స్టాంప్‌లున్న పేజీలను చించివేశాడు. విమానంలో గురువారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. కాగా, ఆ వ్యక్తి పాస్‌పోర్ట్‌లో కొన్ని పేజీలు చించినట్లుగా ఉండటాన్ని ఇమిగ్రేషన్‌ అధికారులు గ్రహించారు. పాస్‌పోర్ట్‌ దుర్వినియోగానికి పాల్పడిన ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఇండియన్ పీనల్ కోడ్ కింద మోసం, ఫోర్జరీ కింద అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ (ends up in prison) చేశారు. అయితే పాస్‌పోర్ట్‌ బుక్‌లో పేజీలు చించివేయడం నేరమన్న సంగతి తెలియక, భార్య కళ్లుగప్పేందుకు అలా చేసినట్లు అతడు చెప్పాడని పోలీసులు తెలిపారు.