Image used for representational purpose | (Photo Credits: PTI)

Mumbai, April 5: ముంబైలో ఆన్ లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన మహిళతో యువకుడు నగ్నంగా చాట్‌ (Naked video calls) చేసి బొక్క బోర్లా పడ్డాడు. ఛాటింగ్ అనంతరం అతడి వాట్సాప్‌కు తన న్యూడ్ వీడియో (Mumbai online blackmailing) వచ్చింది. దీనిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయకుండా ఉండాలంటే గూగుల్‌ పే ద్వారా డబ్బులు పంపాలంటూ బ్లాక్‌మెయిల్‌ చేశారు. దీంతో బాధిత వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.

ముంబైలోని అంధేరి ఈస్ట్‌లో ఎంబీఏ చదువుతున్న 24 ఏండ్ల విద్యార్థి మార్చి 31న ‘హింజ్‌’ అనే డేటింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. సొహీనా అనే మహిళతో చాట్‌ చేశాడు. అయితే నగ్నంగా ఉన్న ఆమె, అతడ్ని కూడా దుస్తులు విప్పి నగ్నంగా మారి చాట్‌ (nude with women on dating app) చేయమని చెప్పింది. దీంతో ఆ యువకుడు అలాగే చేశాడు. అనంతరం ఆ రాత్రి ఆ వ్యక్తి వాట్సాప్‌కు ఒక వీడియో క్లిప్‌ వచ్చింది. అతడు నగ్నంగా చాట్‌ చేస్తున్న వీడియో స్క్రీన్‌ షాట్‌ అందులో ఉంది.

విద్యార్ధుల‌తో మ‌హిళా టీచ‌ర్ గ్రూప్ సెక్స్ వీడియో వైరల్, స్నేహితులకు ఆ వీడియోను పంపిన ఆమె ప్రియుడు, దర్యాప్తు ప్రారంభించిన తమిళనాడు సైబర్ సెల్

ఆ వీడియోను అతడి పేరెంట్స్‌తోపాటు ఇతరులకు షేర్‌ చేయకుండా ఉండాలంటే గూగు‌‌ల్‌ పే (pay extortion through Google Pay) ద్వారా రూ.10,000 ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటూ ఒక మెసేజ్‌ వచ్చింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడికి వచ్చిన మెసేజ్‌లోని గూగుల్‌ పే మొబైల్‌ నంబర్‌ సోను కుమార్‌ అనే వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.