Representational Image | (Photo Credits: IANS)

కన్నతల్లి క్యాన్సర్‌ చికిత్సకు డబ్బుల్లేక కూతురు తన కన్యత్వాన్ని అమ్ముకోవడానికి (old Girl into Flesh Trade) సిద్ధపడింది. ఐదువేల రూపాయలకు అంగడి సరుకుగా మారేందుకు రెడీ అయింది. చివర్లో పోలీసుల ఎంట్రీతో ఆమె క్షేమంగా బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో (Nagpur in Maharashtra) చోటుచేసుకుంది. నాగపూర్ పోలీసుల కథనం ప్రకారం బాధిత బాలిక తల్లి కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. పేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చుల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వారి అవసరాన్ని పొరుగున ఉండే అర్చనా వైశంపాయన్‌ (39) పసిగట్టింది. మాయమాటలు చెప్పి బాలిక కన్యత్వానికి రూ.5వేలు వెల కట్టేలా ఒప్పించి, తనతో పంపమంది. విధిలేని పరిస్థితుల్లో ఆ తల్లి ఒప్పుకుంది. అర్చనతోపాటు రంజనా మెష్రామ్‌ (45), కవితా నిఖారే (30)లు ఓ వ్యక్తితో రూ.40వేలకు బేరం కుదిర్చారు. కానీ బాలికను ‘కొనుగోలు’ చేసిన విటుడే జాలిపడి ఓ స్వచ్ఛంద సంస్థకు ఉప్పందించాడు.

మగ పిల్లాడు పుడితేనే మా ఇంటికి రా, కోడలిని శాసించిన అత్త, ఆమె కొడుకు, కూతురును భూమి మీదకు రానివ్వడం లేదని వేదనతో ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు

ఆ సంస్థ సోషల్‌ సర్వీస్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఎస్‌బీ) పోలీసులకు చెప్పడంతో వారు రంగంలోకి దిగారు.బాలిక ఆ రొంపిలోకి దిగకముందే పోలీసులు ఆమెను రక్షించారు. చిన్నారిని ఒత్తిడి చేసి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమైన ముగ్గురు మహిళలను అరెస్టు (3 Women Held) చేశారు.