Telangana Shocker: మగ పిల్లాడు పుడితేనే మా ఇంటికి రా, కోడలిని శాసించిన అత్త, ఆమె కొడుకు, కూతురును భూమి మీదకు రానివ్వడం లేదని వేదనతో ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు
Representational Image (Photo Credits: File Image)

Hyd, Oct 3: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురాలో దారుణం చోటు చేసుకుంది. అత్త, భర్త వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. గర్భంలో ఆడపిల్ల ఉంటే ఆబార్షన్‌ చేయించుకో.. మగపిల్లవాడు పుడితేనే ఇంట్లో అడుగుపెట్టమని భర్త, అత్త ఖరాఖండిగా (husband torture) చెప్పడంతో నాలుగు నెలల గర్భిణీ మనోవేదనకు గురై ఉరి వేసుకుని ఆత్మహత్య (Woman ends life ) చేసుకుంది. తన కూతురును అత్తింటివాళ్లు భూమి మీదకు రానివ్వడం లేదని ఈ లోకం విడిచి వెళ్లింది.

కామాటిపురా ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు తెలిపిన మేరకు.. మోయిన్‌పురా ప్రాంతానికి చెందిన మీనాజ్‌ బేగం కూతురు రుబీనా బేగం (23).. ముర్గీచౌక్‌ ప్రాంతానికి చెందిన అమేర్‌ను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. భర్త, అత్తింటి వారు అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవారు. రుబీనా బేగం నాలుగు నెలల గర్భవతి కావడంతో ఇటీవల పుట్టింటికి పంపించారు. మళ్లీ ఆడ పిల్ల పుడితే మా ఇంటికి రావద్దంటూ భర్త, అత్త ఖరాఖండిగా చెప్పారు. మీ సామగ్రిని పంపిస్తామని తేల్చి చెప్పారు. గర్భంలో ఆడ పిల్ల ఉంటే ఆబార్షన్‌ చేయించుకో... మగ పిల్లవాడు ఉంటేనే ఇక్కడికి రావాలంటూ హుకుం జారీ చేశారు.

మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు అక్కడికక్కడే మృతి, మరొకరికి తీవ్ర గాయాలు, కృష్ణా జిల్లాలో విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడు మృతి

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రుబీనా బేగం శనివారం ఉదయం మొదటి అంతస్తులో ఉన్న ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పైకి వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి మీనాజ్‌ బేగం తలుపులు పగలగొట్టి చూడగా... ఉరేసుకొని కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వవడంతో మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మీనాజ్‌బేగం ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.