Road accident (image use for representational)

Hyd, Oct 3: భాగ్యనగరంలో మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం (Madhapur Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. ద్విచక్రవాహనంపై భాగ్యనగర్‌ సొసైటీ వైపు వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారన్న విషయాన్ని గమనించారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఎన్‌ఐఏ వద్ద అతివేగంగా వెళ్తూ కార్‌ను ఢీ కొట్టారు. దీంతో బైక్‌ నడుపుతున్న గణేష్‌ రాజు తీవ్రంగా గాయపడ్డాడు. వెనుక కూర్చున్న అతని సోదరుడు చైతన్య వర్మ ప్రమాదస్థలంలోనే కన్నుమూశాడు. గణేష్‌ రాజును ఆస్పత్రికి తరలించారు.

కారు డ్రైవర్‌రాజేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు మండల మల్కిపురంకు చెందిన వీరు బోరబండ వివేకానంద నగర్‌లో పెదనాన్న రాజు ఇంటిలో నివాసం ఉంటున్నారు. మృతుడు శంకర్‌పల్లెలో ఉన్న ఐబీఎస్‌ కాలేజీలో బీబీఎమ్‌ చదువుతుండగా.. గాయపడిన గణేష్ రాజు పంజాగుట్టలోని ఎమిటీ కాలేజీలో బీబీఎమ్‌ చదువుతున్నారు.

మానవ మృగాలకు చిక్కిన మూగ చెవిటి బాలిక, ఆరు మంది సామూహిక అత్యాచారం, తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక విలపించిన బాధితురాలు, ఎట్టకేలకు సంజ్ఞల ద్వారా పోలీసులకు తెలిపిన బాలిక

వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న నాలుగు ప్రమాదాల్లో ఐదుమంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు కర్ణాటక వాసులు, ఒక చిన్నారి ఉన్నారు. నార్సింగి సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఐషర్‌ వాహనం ఢీకొట్టింది ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారని, నార్సింగి ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి తెలిపారు. ఇక ఓ లారీ డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా శంకర్‌పల్లికి చెందిన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. శంకర్‌పల్లికి చెందిన కలీమ్‌ మధ్యాహ్నం తన కుమారుడు హర్మన్‌(4)తో కలిసి బైక్‌పై వెళ్తూ బావార్చి హోటల్‌ వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. హర్మన్‌ ఎగిరి కింద పడి మృతి చెందాడు. డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.

మద్యం మత్తులో వేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. చాంద్రాయణగుట్టకు చెందిన శ్రీకాంత్‌(24), అరుణ్‌కుమార్‌(24)లు శుక్రవారం రాత్రి ఓ వేడుకకు వెళ్లి మద్యం మత్తులో శనివారం తెల్లవారుజామున బైక్‌పై వస్తూ లక్ష్మీగూడ రాజీవ్‌గృహకల్ప వద్ద డివైడర్‌ను ఢీకొట్టారు. శ్రీకాంత్‌ అక్కడికక్కడే మృతి చెందగా..అరుణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఏపీలో కృష్ణా జిల్లా మైలవరం మండలం టి.గన్నవరంలో విషాదం నెలకొంది. వరి పొలాల్లో విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడు మృతి చెందారు. పొలానికి వేసిన కంచెకు విద్యుత్‌ సరఫరా కావడంతో ఈ ఘటన జరిగింది. మృతులను ఆగిరిపల్లి మండలం ఈదర వాసులు అర్జునరావు, అజయ్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.