Stalin

Chennai, June 28: వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రద్దు (Scrap NEET) చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మణితనేయ మక్కల్ కట్చి, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం, తమిళగ వెట్రి కజగం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సహా పలు ప్రాంతీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి. నీట్ ప‌రీక్షా ప‌త్రం లీక్ వ్య‌వ‌హారంలో కీల‌క ట్విస్ట్, ప‌రీక్ష నిర్వ‌హ‌ణలో అవ‌క‌త‌వ‌కలపై ఎఫ్ఐఆర్ న‌మోదు

మరోవైపు దేశవ్యాప్తంగా మెడికల్ అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన నీట్ నుంచి మినహాయించాలన్న తమిళనాడు డిమాండ్‌ను డీఎంకే ఎంపీ కనిమొళి ఢిల్లీలో పునరుద్ఘాటించారు. ‘మాకు నీట్ వద్దు అని తమిళనాడు స్పష్టంగా చెబుతోంది. నీట్ సరైన పరీక్ష కాదని ఇప్పుడు రుజువైంది. నీట్ వల్ల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు’ అని మీడియాతో ఆమె అన్నారు. గతంలో నీట్‌ మినహాయింపుతోపాటు తాజాగా నీట్‌ రద్దు చేయాలన్న తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిందని వెల్లడించారు.