supreme court(X)

Delhi, July 24:  నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీ,ఆ తర్వాత విద్యార్థుల ఆందోళన వెరసీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తారా అన్న సందేహం కూడా నెలకొంది. అయితే నీట్ పరీక్ష నిర్వహణపై సుప్రీం క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పేపర్ లీకేజీ నిజమేనని కానీ దీనివల్ల లబ్ది పొందింది కేవలం 155 మంది విద్యార్థులు మాత్రమే కావడంతో పరీక్షను మళ్లీ నిర్వహించడానికి అవకాశం లేదని తేల్చేసింది.

ఇక నీట్ ప్రశ్నాపత్రంలో ఫిజిక్స్‌లోని 29వ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉండగా ఆ రెండింట్లో ఏ ఒక్క దానిని ఎంపిక చేసిన మార్కులు కేటాయించారు. దీంతో ఓ అభ్యర్థి సుప్రీంను ఆశ్రయించారు. ఇలా రెండు సమాధానాలకు మార్కులు ఇవ్వడం వల్ల చాలా మందికి 4 మార్కులు అదనంగా వచ్చాయని, ఇది మెరిట్ లిస్ట్‌పై ప్రభావం చూపిందని పేర్కొన్నారు.

దీంతో అభ్యర్థి వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ చంద్రచూడ్ ..ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయగా 25వ తేది మధ్యాహ్నం 12 గంటల లోపు సూచనలను అందించాలని ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. అలాగే ఒక ప్రశ్నలో రెండు ఆప్షన్లకు మార్కులు ఇవ్వడం కుదరదని, కేవలం ఆప్షన్ 4 ఎంచుకున్న అభ్యర్థులకే మార్కులు ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించింది. సుప్రీం ఆదేశంతో రివైజ్డ్ ర్యాంకులు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.

సుప్రీం సూచనతో పరీక్షకు హాజరైన 24 లక్షల మందిలో 4.2 లక్షల మంది 4 మార్కులు కొల్పోగా ఇందులో 720కి గాను 720 మార్కులు సాధించిన 44 మంది ఉండటం విశేషం. మొత్తంగా ఎన్నో గందరగోళాలకు ఈ ఏడాది నీట్ కేరాఫ్‌గా మారిందనే అభిప్రాయం మాత్రం అందరిలో వ్యక్తమవుతోంది. నీట్ పరీక్ష తిరిగి నిర్వహిస్తే మొత్తం 24 లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులు పాలవుతారు, మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపిన సుప్రీంకోర్టు

Here's Tweet: