కొత్తగా ఏర్పాటు అవుతున్న భారత పార్లమెంటు భవన సముదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభోత్సవం చేయించకపోవడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఇది దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించడమేనని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని కనీసం ఆహ్వానించకపోవడం కూడా అవమానకరం అని పేర్కొన్నారు. పార్లమెంటు భవనం అహంకారం అనే ఇటుకలతో నిర్మితం కాలేదని, రాజ్యాంగ విలువలతో నిర్మితమైందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ నెల 18న ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారభించాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. మే 28న కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం జరగనుంది.

Rahul Gandhi Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)