Delhi, July 27: కేంద్రంలో నరేంద్రమోడీ 3.0 అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమమైంది. ఢిల్లీలోకి రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో పాటు నీతి అయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ -2047 ఏజెండగా ఈ సమావేశం జరుగుతోంది.
ఈ సమావేశాన్ని ఇండియా కూటమి సీఎంలు బహిష్కరించారు. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరుకాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా ఆరు రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇక ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరు కాకపోవడం గమనార్హం.
వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీడీపీతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపాలని భావిస్తున్నామని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వికసిత్ భారత్ కు రోడ్ మ్యాప్ రూపోందించడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగుతోంది.
దీంతో పాటు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామం, గ్రామీణ, పట్టణ జనాభా జీవన ప్రమాణాల పెంపు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పలు అంశాలపైనా నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులు సలహాలు, సూచనలు చేయనున్నారు.
ఈ సమావేశంలో మూడవ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం సిఫార్సులపైనా చర్చ జరగనుంది. తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, పాఠశాల విద్య, భూమి,సైబర్ సెక్యూరిటీ, వంటి అంశాలను నీతిఆయోగ్ 9వ పాలకమండలి సమావేశంలో ఆమోదించనున్నారు. హైదరాబాద్ మెట్రోకు నిధులేవి, 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే ఇచ్చింది గుండు సన్నా?, తెలంగాణపై మోడీకి నిలువెల్లా విషమే,కేటీఆర్ ఫైర్