Passengers at platform | (Photo Credits: Getty Images)

New Delhi, April 05: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (coronavirus) చాపకింద నీరులా విస్తరిస్తూ పోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ (India Lockdown) ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని కేంద్రం ఆదేశాలు (Center) జారీ చేసింది. ఈ నేపథ్యంలో రవాణా మొత్తం ఎక్కడికక్కడ స్థంభించి పోయింది.

ఇండియన్ రైల్వే (Indian Railways) కూడా సర్వీసులను ఆపేసింది. అయితే లాక్ డౌన్ తర్వాత రైల్వే సర్వీసులు ప్రారంభమవుతాయని, ఇప్పటికే టికెట్ల బుకింగ్ ప్రాసెస్ జరుగుతోందని సోషల్ మీడియాలో (Social Media) వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇండియన్ రైల్వే క్లారిటీ ఇచ్చింది.

గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ముంబై మురికివాడ ధారావి

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రైల్వే సేవలను పునరుద్ధరించే అంశమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే తాము తప్పకుండా వెల్లడిస్తామని ట్విటర్లో పేర్కొంది.

Here's Indian Railways Tweet

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ ఈ నెల 12తో ముగుస్తున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి రైల్వే సేవల పునరుద్ధరణ, టికెట్ బుకింగ్‌పై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

ప్రధాని మోదీ 9 నిమిషాల మెసేజ్ రహస్యం

ఇవాళ ట్విటర్ వేదికగా రైల్వే శాఖ స్పందిస్తూ....లాక్‌డౌన్ తర్వాత రైల్వే సేవల పునరుద్ధరణ, రాకపోకలపై మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ప్యాసెంజర్ సర్వీసుల పునఃప్రారంభానికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తున్నాం. ఈ విషయమై ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా అందరికీ వెల్లడిస్తాం...’’ అని స్పష్టం చేసింది. పాలు, బియ్యం, గోధుమలు సహా ఇతర నిత్యావసర వస్తువుల కోసం పార్సిల్ ట్రైన్లను ఇప్పటికే ప్రారంభించినట్టు తెలిపింది. కాగా లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా గూడ్స్ రైళ్లు యథాతథంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.

కరోనావైరస్‌కి వర్షాలు తోడు, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

ఇండియాలో ఇండియాలో కరోనావైరస్ రోగుల సంఖ్య 3,000 మార్కును దాటింది. 213 మంది కోలుకున్నారని, 75 మరణాలు ఉన్నాయని శనివారం ఆరోగ్య మంత్రి చెప్పారు.