Noida Shocker: కామాంధుడైన 80 ఏళ్ళ వృద్ధుడు, బాలికపై ఏడేళ్ల నుంచి అసహజరీతిలో అత్యాచారం, డిజిటల్ రేప్ కింద కేసు నమోదు చేసిన నోయిడా పోలీసులు
Arrested (Photo Credits: Pixabay/ Representational Image)

Noida, May 16: నోయిడాలో దారుణం జరిగింది. మనవరాలి వయస్సున బాలికపై ఓ 80 ఏళ్ళ వృద్ధ కామాంధుడు తెగబడ్డాడు. చదువు చెబుతానంటూ నమ్మబలికి ఏడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం (Noida Shocker) వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడి మౌరైస్‌ రైడర్‌ వయసు 81 ఏళ్లు. వృత్తి రిత్యా పెయింటింగ్‌ ఆర్టిస్ట్‌, టీచర్‌ కూడా. హిమాచల్‌ ప్రదేశ్‌లో అతనికొ ఒక ఆఫీస్‌ ఉంది. ఏడేళ్ల కిందట అతని దగ్గర పని చేసే ఓ వ్యక్తి.. తన కూతురిని ఆ వృద్ధుడి దగ్గరకు సాయంగా పంపించాడు. బదులుగా ఆ వృద్ధుడు ఆమెకు చదువు చెప్పిస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఆనాటి నుంచి వృద్ధుడు ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు. తండ్రికి చెబితే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె భరిస్తూ వచ్చింది.

చివరికి.. ఆ వృద్ధుడి ఆగడాలు తట్టుకోలేక ఆ టీనేజర్‌ ధైర్యం తెచ్చుకుంది. గత నెల రోజులుగా మౌరైస్‌ బాగోతాలను రికార్డు చేస్తూ వచ్చింది. అందులో చాలావరకు ఆడియో ఫైల్స్‌ ఉన్నాయి. చివరకు వాటిని ఓ మహిళకు అప్పగించి, ఆమె సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. దీంతో గౌతమ్‌ బుద్ధ నగర్‌ పోలీసులు(నోయిడా, యూపీ).. ఆదివారం డిజిటల్‌ రేప్‌ నేరం కింద మౌరైస్‌ను అరెస్ట్‌ (80 year old Man Arrested) చేశారు.

గుంటూరు జిల్లాలో దారుణం, ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

డిజిటల్‌ రేప్‌ (Digitally Raping) అంటే.. మర్మాంగం కాకుండా ఏదేని వస్తువు, ఆయుధాలను, చేతి వేళ్లను ఉపయోగించి అసహజరీతిలో లైంగిక దాడులకు పాల్పడడం. ఇంగ్లీష్‌ డిక్షనరీలో డిజిటల్‌ అనే పదానికి అర్థంతో ఈ నేరానికి ఆ పేరొచ్చింది. అయితే గతంలో ఇది అత్యాచారం కిందకు వచ్చేది కాదు. కానీ, 2012 నిర్భయ ఘటన తర్వాత డిజిటల్‌ రేప్‌ను అమలులోకి తీసుకొచ్చారు. డిజిటల్‌ రేప్‌ కింద.. ఒక వ్యక్తికి కనీసం ఐదేళ్లు, గరిష్టంగా పదేళ్లు.. ఒక్కోసారి జీవిత ఖైదు విధిస్తారు. ఈ తరహా ఘటనల్లో 70 శాతం దగ్గరి వాళ్ల వల్లనే జరుగుతున్నాయి. కాబట్టే.. చాలా చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.