Image used for representational purpose only | (Photo Credits: PTI)

Amaravati, May 16: గుంటూరు జిల్లాలో దారుణం (Andhra Pradesh Shocker) చోటు చేసుకుంది. ప్రియుడి చేతిలో గ్రామ వలంటీర్‌ దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలోని చావలి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చావలిలోని దళితవాడకు చెందిన దొప్పలపూడి శారద (25)కు అదే గ్రామానికి చెందిన మద్దా పద్మారావుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం( extramarital affair in Guntur) కొనసాగుతోంది. శారద ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇంటి వాకిలి ఊడుస్తుండగా పద్మారావు ఆమెను ఇంట్లోకి పిలిచి కత్తితో మెడ (Village Volunteer brutally killed) కోశాడు. ఢిల్లీలో దారుణం, డబ్బులు ఇవ్వలేదని ప్రియురాలిని కత్తితో పొడిచి చంపేశాడు, మరో ఘటనలో మధ్య ప్రదేశ్‌లో ఐదేండ్లుగా మేన‌కోడ‌లిపై లైంగిక దాడి

అనంతరం అదే కత్తితో గుండె పైనుంచి పొట్ట భాగం వరకు కోసేశాడు. ఆమె పొట్టలోంచి పేగులు బయటకు రాగా.. శారద రెండు చేతులతో వాటిని పట్టుకుని అరుస్తూ రోడ్డుపైకి వచ్చి పడిపోయింది. స్థానికులు 108కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ వచ్చే సమయానికి శారద మృతి చెందినట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. హతురాలు చావలి గ్రామ సచివాలయం ఒకటో వార్డు వలంటీర్‌గా పని చేస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త ధర్మారావు ఇంట్లోలేని సమయంలో ఈ ఘటన జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. పద్మారావును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు.