CM Yogi Adityanath: ఇప్పుడు రోడ్లపై నమాజ్ అన్న మాటే వినపడటం లేదు, శ్రీ రామనవమి సందర్భంగా ఎక్కడా అల్లర్లు లేవు, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు
Uttar Pradesh Chief Minister Yogi Adityanath (Photo:ANI)

Lucknow, May 23; ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి విదితమే. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (CM Yogi Adityanath) రెండోసారి ముఖ‍్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సీఎం యోగి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కంట్రోలోనే ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుప‌డ్డాయని అన్నారు.

యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈద్ సందర్భంగా వీధుల్లో ప్రార్థనలు చేయడం (Offering Namaz on Roads) ఆగిపోయిందని అన్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా ఈద్‌కు నమాజ్, జుమాల‌ను రహదారిపై నిర్వహించబడలేద‌ని (Stopped Since BJP Came to Power) అన్నారు. ఈ క్రమంలోనే రామ నవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో మత ఘర్షణలు జరగలేదని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో శ్రీ రామనవమి సందర్భంగా మత ఘర్షణలు జరగలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగుందని సీఎం పేర్కొన్నారు. ‘‘ఉత్తరప్రదేశ్‌లో రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు జరగలేదు. ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా ఈద్, అల్విదా జుమా సందర్భంగా నమాజ్‌ను రోడ్డుపై నిర్వహించలేదు’’ అని యోగి అన్నారు.

దేశంలో మొదటిసారిగా బీఏ.4, బీఏ.5 ఉనికి గుర్తింపు, గత 24 గంటల్లో 2022 మందికి కరోనా, 14,832 కేసులు యాక్టివ్‌

అలాగే, గోవుల కోసం గోశాలను నిర్మించినట్టు తెలిపారు. ఇక, తాను సీఎం అయినప్పటి నుంచి(2017) యూపీలో ఎక్కడా అల్లర్లు చోటుచేసుకోలేదని వెల్లడించారు. గతంలో ముజఫర్‌నగర్‌, మీరట్‌, మొరాదాబాద్‌ తదితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగేవని.. నెలల తరబడి కర్ఫ్యూలు ఉండేవని.. అయితే తన పాలనలో మాత్రం అల్లర్లు జరగలేదన్నారు. అలాగే, యూపీలో మతపరమైన స్థలాలను నిర్మించడంతో పాటుగా ప‌లు దేవాల‌యాల‌ను పునర్నిర్మించమ‌ని తెలిపారు. మేం మతపరమైన ప్రదేశాల్లోని లౌడ్ స్పీకర్లను కూడా తొలగించాం. మా ప్రభుత్వం 700 కంటే ఎక్కువ మతపరమైన స్థలాలను పునర్నిర్మించింది’’ అని యోగి వివరించారు.