Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, Jan 11: దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తున్న నేపథ్యంలో కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) కీలక మార్గదర్శకాలు (New COVID Guidelines) జారీచేసింది. కరోనా లక్షణాలు లేని వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు మాత్రం తప్పనిసరిగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్‌ (ICMR) స్పష్టంచేసింది.

దాంతోపాటు వయసు రీత్యా, అనారోగ్య సమస్యల పరంగా హై రిస్క్‌ కేటగిరీలోకి రాకపోతే.. కోవిడ్ క్లోజ్ కాంటాక్ట్స్‌కు కూడా పరీక్షలు (ICMR issues, new COVID guidelines) అవసరం లేదని పేర్కొంది. హోం ఐసోలేషన్ మార్గదర్శకాల ప్రకారం డిశ్చార్జి అయిన పేషెంట్లు, రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు... కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్‌ ప్రకటించింది.

దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా, గత 24 గంటల్లో 1,68,063 కొత్త కేసులు, నిన్న క‌రోనాతో 277 మంది మృతి

ర్యాపిడ్‌ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, మళ్లీ పరీక్ష చేయించాల్సిన అవసరం లేదని పేర్కొంది. నెగెటివ్ వచ్చినప్పటికీ కోవిడ్ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది.