LPG cylinders. (Photo Credit: File Image)

New Delhi, Oct 17: ఎల్పీజీ సరఫరాలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 1నుంచి (new rules from Nov 01) వంటగ్యాస్‌ సిలిండర్ల సరఫరాకు వన్‌టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) తప్పనిసరి (OTP for delivery of LPG cylinders) అని ప్రకటించాయి. వినియోగదారుడు తన రిజిస్ట్రేషన్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని చెప్తేనే గ్యాస్‌ సిలిండర్‌ను సరఫరా చేయనున్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన డెలివరీ అథెంటికేషన్‌ కోడ్‌ (DAC)లో భాగంగా ఈ నిర్ణయాన్ని చమురు సంస్థలు తీసుకున్నాయి. సిలిండర్లు పక్కదారి పట్టకుండా చూడటం, నిజమైన వినియోగదారులను గుర్తించటమే ఈ విధానం లక్ష్యమని పేర్కొన్నాయి. ఈ ఓటీపీ విధానాన్ని దేశవ్యాప్తంగా 100 స్మార్ట్‌ సిటీల్లో మొదట ప్రారంభిస్తారు.

డెలివరీ బాయ్‌కి కస్టమర్ ఓటీపీ (OTP) చెబితే దానిని అతని దగ్గర ఉండే ఫోన్‌లో నమోదు చేసుకుని ఇకపై సిలిండర్‌ (LPG Cylinder) అందజేస్తాడు. దీంతో బుక్‌ చేసుకున్న కస్టమర్‌కే సిలిండర్‌ అందుతుంది. OTP లేకపోతే, వినియోగదారులు తమ ఆధార్ కార్డును చూపించడం ద్వారా కూడా డెలివరీ తీసుకోవచ్చు.

ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ, నిబంధనల్లో పలు మార్పులను తీసుకువచ్చిన ఆయిల్ కంపెనీలు, త్వరలో వాట్సాప్‌ ద్వారా కూడా నగదు చెల్లించే సదుపాయం

అంతేకాదు కరోనా నేపథ్యంలో డోర్‌ డెలివరీ బాయ్‌కి నగదును నేరుగా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే వెసులుబాటును కూడా గ్యాస్‌ సరఫరా సంస్థలు కల్పించాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించిన తర్వాత జనరేట్‌తో పాటు డెలివరీ అక్నాలెడ్జిమెంట్‌ కోడ్‌ (డీఏసీ) వినియోగదారుడి సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం రూపంలో పంపించి దాని ఆధారంగా సిలిండర్‌ డెలివరీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. గ్యాస్ బుకింగ్ నుండి చెల్లింపు వరకు అన్ని పనులను డిజిటలైజ్ చేయడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసిన విషయం విదితమే