New Delhi, August 30: బుక్ చేసిన సిలిండర్ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా ఉండేందుకు ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలు, పాత నిబంధనల్లో మార్పు (New Rules For LPG Gas Cylinder) చేశారు. మార్పు చేసిన నిబంధనల ప్రకారం ఆయిల్ కంపెనీలు ఇకపై ఓటీపీ చూపిస్తేనే సిలిండర్ డెలివరీ (LPG Gas Cylinder delivery) ఇవ్వనున్నారు. డెలివరీ బాయ్‌కి కస్టమర్ ఓటీపీ (OTP) చెబితే దానిని అతని దగ్గర ఉండే ఫోన్‌లో నమోదు చేసుకుని ఇకపై సిలిండర్ (LPG Cylinder) అందజేస్తాడు. దీంతో బుక్ చేసుకున్న కస్టమర్‌కే సిలిండర్ అందుతుంది. OTP లేకపోతే, వినియోగదారులు తమ ఆధార్ కార్డును చూపించడం ద్వారా కూడా డెలివరీ తీసుకోవచ్చు.
అంతేకాదు కరోనా నేపథ్యంలో డోర్ డెలివరీ బాయ్‌కి నగదును నేరుగా కాకుండా ఆన్‌లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటును కూడా గ్యాస్ సరఫరా సంస్థలు కల్పించాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించిన తర్వాత జనరేట్‌తో పాటు డెలివరీ అక్నాలెడ్జిమెంట్ కోడ్ (డీఏసీ) వినియోగదారుడి సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం రూపంలో పంపించి దాని ఆధారంగా సిలిండర్ డెలివరీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. గ్యాస్ బుకింగ్ నుండి చెల్లింపు వరకు అన్ని పనులను డిజిటలైజ్ చేయడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసిన విషయం విదితమే. ఏపీకి తాజాగా రూ.4,881 కోట్ల మేర అదనపు ఆదాయం
గ్యాస్ సిలిండర్ బుకింగ్, బిల్లు చెల్లింపు విధానాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయిల్ కంపెనీలు అప్‌డెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో డీలర్ కార్యాలయానికి ఫోన్ చేసి గాని, నేరుగా వెళ్లి గాని సిలిండర్ బుక్ చేసుకునే వారు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ ద్వారా ఐవీఆర్‌ఎస్ విధానం అమలులోకి వచ్చింది. ఇటీవల యాప్‌ల ద్వారా బుక్ చేస్తున్నారు. ఇందుకోసం పలు గ్యాస్ సరఫరా సంస్థలు యాప్‌లను ప్రవేశపెట్టాయి. అమెజాన్ ద్వారా రీఫిల్ బుక్ చేసిన వారికి రూ.50 రాయితీ కూడా ప్రకటించింది. తాజాగా కొత్తగా ఓటీపీ విధానం అమల్లోకి వచ్చింది. రైతులుంటేనే దేశం, కరోనా కాలంలో రైతులు పడుతున్న కష్టాన్ని కొనియాడిన ప్రధాని మోదీ
దీంతో పాటు ఏజెన్సీలు నగదు చెల్లింపులకు కూడా చెక్ పెడుతూ వాట్సాప్ ద్వారా సులభంగా డబ్బును చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. రిజిస్టర్ నంబర్ల ద్వారా చమురు సంస్థల వాట్సప్ నంబర్లకు హాయ్ అని సమాచారం ఇవ్వాలి. ఇలా వచ్చిన వెంటనే క్షణాల్లో స్పందనను పొందవచ్చు. బుకింగ్‌తో పాటు నగదును తమ డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, తదితర వాటిని వినియోగించి చెల్లించవచ్చు. దీనికి తోడు ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా నగదును బదిలీ చేయవచ్చు. వినియోగదారులకు మరింత అవగాహన పెంచడం ద్వారా డిజిటల్ చెల్లింపులు, ఓటీపీ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుకు సాధ్యపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.