Guwahati, May 27: ఇండియాను కరోనావైరస్ (Coronavirus) వణికిస్తుంటే ఈశాన్య భారతానికి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (African Swine Fever) ముచ్చెమటలు పట్టిస్తోంది. ఫిబ్రవరిలో అస్సాంలో ( Assam) తొలి స్వైన్ ఫీవర్ కేసు నమోదు కాగా. ప్రస్తుతం అది తీవ్రరూపం దాల్చి 15,600 పందులు మరణించాయని ఆ రాష్ర్ట పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా ( state Animal Husbandry Minister Atul Bora) తెలిపారు. పందుల్లో సంక్రమించే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి కావడంతో దీని నివారణకు పందులను (pigs) సామూహికంగా చంపేందుకు కేంద్రప్రభుత్వం గతంలో అనుమతినిచ్చింది. లక్షా యాభై వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలో యాభై వేలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశ వ్యాప్తంగా 4,337 మంది మృతి
పందుల లాలాజలం, రక్తం, మాంసం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో అక్కడ జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే వ్యాధి నివారణకు రాష్ర్ట ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని అతుల్ అన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పందులను సామూహికంగా చంపేందుకు స్థానిక ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం వైరస్ సోకిన పందులను మాత్రమే చంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Here's ANI Tweet
African swine fever is increasing day by day, till today there have been 15600 cases. We have decided on certain relaxations in selling & consumption of pork products in the state, this will provide much relief to pig rearers: Atul Bora, Assam Animal Husbandry Minister (26.05.20) pic.twitter.com/S9v2sFl2Dz
— ANI (@ANI) May 26, 2020
ఇదిలా ఉంటే వ్యాధి బారిన పడి చనిపోయిన పందులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. పందులను పెంచే రైతులకు ఒకే విడతలో రూ.144 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించాలని కేంద్రాన్ని కోరింది. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న ఈ సంక్షోభం కారణంగా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అసోం పశు సంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. రోజురోజుకీ పందుల మరణాలు పెరుతున్నాయని, ప్రస్తుతం వైరస్ ప్రభావం పది జిల్లాలకు సోకిందని పేర్కొన్నారు. పంది పెంపకం దారులకు ఉపశమనం కలిగించే దిశగా పంది మాంసం అమ్మకం, వినియోగం విషయంలో కొన్ని నిబంధనలపై సడలింపు ఇచ్చామని అతుల్ బోరా చెప్పారు.