New delhi, November 8: భారత ఆర్మీ రహస్యాలు దొంగిలించడానికి దాయాది దేశం పాకిస్థాన్ అడ్డదారులు తొక్కుతోంది. మన సైనికులపైకి అమ్మాయిల ముసుగుతో వల (హనీట్రాప్) విసురుతోంది. దాయాది దేశం ఈ కుట్రలకు సోషల్ మీడియా(Social Media)నే వేదికగా ఎంచుకుంటోంది. కుటుంబానికి దూరంగా ఉంటూ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్ల (Soldiers)కు మత్తుగా మాటలు చెప్పి.. నెమ్మదిగా లోబరుచుకుని ‘ట్రాప్’()Pak Agents Honey-Trapలోకి దింపుతోంది. ఈ కుట్రలకు పాక్ ఆర్మీ( Pak Army) సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది.
సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లకు మత్తుగా మాటలు చెప్పి.. నెమ్మదిగా లోబరుచుకుని ‘ట్రాప్’లోకి దింపుతోంది. తమ మాయలో పడ్డాక సైనిక, ఆయుధ స్థావరాల వివరాలను కూపీ లాగుతోంది. తరచూ ఇటువంటి ఘటనలు ఎక్కువ కావడంతో భారత ఆర్మీ (Indian Army) దీనిపై అప్రమత్తం అయింది. భారత్ జవాన్లకు కొన్ని జాగ్రత్తలు చెబుతూ అడ్వైజరీ జారీ చేసింది.
ఆన్‌లైన్(Online)లో అపరిచితులతో స్నేహం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సైన్యం హెచ్చరించింది. భారత జవాన్లే లక్ష్యంగా పాక్ గూఢచార సంస్థ పనిచేస్తోందని, ఆధ్యాత్మిక బోధకులు, విదేశీ మహిళలమంటూ స్నేహహస్తం అందించే వారి విషయంలో, ముఖ్యంగా సున్నితమైన సమాచారం పంచుకునే విషయంలో విచక్షణతో మెలగాలని సూచించింది.
సున్నిత ప్రాంతాల్లో మెహరించిన సైనికులకు సంబంధించిన సమాచారం, ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు తెలుసుకునేందుకు తప్పుడు ప్రొఫైల్స్‌తో పాక్ ఏజెంట్లు భారత జవాన్లకు ఎరవేస్తున్నారని తెలిపింది. కాగా రెండు, మూడేళ్ల క్రితం నాటి ఇటువంటి 150 ప్రొఫైల్స్‌ను ఇప్పటివరకు గుర్తించామని గత నెలలోనే దేశవ్యాప్తంగా ఉన్న కమాండింగ్ సెంటర్లు, డైరెక్టరేట్ల ద్వారా హెచ్చరించినట్లు సైన్యం తెలిపింది.
రాజస్థాన్‌లో ఇద్దరు జవాన్లకు హనీట్రాప్
తాజాగా రాజస్థాన్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు పాక్ ఆర్మీ హనీట్రాప్‌లో పడ్డారు. లాన్స్ నాయక్ రవి వర్మ, సిపాయి విచిత్ర బెహెరా పాక్ ఇంటెలిజెన్స్ వలలో చిక్కారని గుర్తించి రాజస్థాన్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. పాక్ హనీ ట్రాప్ ఐడీలను ట్రాక్ చేస్తున్న మన ఆర్మీ వారిని పట్టుకోగలిగింది. సీరాత్ అనే ఐడీ నుంచి మహిళ ఫొటోతో వాళ్లని లోబరుచుకుని ఆర్మీ రహస్యాలను దొంగిలించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు అధికారులు. రాజస్థాన్ పోలీసులు ఈ ఇద్దరు జవాన్లను అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు .
ఆర్మీ జారీ చేసిన అడ్వైజరీ కీలకమైన అంశాలు
ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారానే జవాన్లను టార్గెట్ చేస్తున్నట్లు ఆర్మీ గుర్తించింది. హనీట్రాప్‌ల కోసం ప్రత్యేకంగా 150 ఫేస్ బుక్ ఐడీలను దాయాది దేశం క్రియేట్ చేసింది. ఆ ఐడీలను ట్రాక్ చేసిన భారత ఇంటెలిజెన్స్ వర్గాలు వాటి జోలికె వెళ్లొద్దని హెచ్చరించింది. గుర్తు తెలియని వ్యక్తులు, ముఖ్యంగా పరిచయం లేని మహిళలు, మత గురువుల ఐటీల నుంచి ఎటువంటి మెసేజ్‌లు వచ్చినా స్పందించవద్దని తెలిపింది.
సోషల్ మీడియా వేదికగా అసలు ఎటువంటి పర్సనల్, సెన్సిటివ్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. హనీ ట్రాప్‌ల విషయంలో అలర్ట్‌గా ఉండండి. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లేదా ఇన్సూరెన్స్ ఏజెన్సీల నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా చెప్పి.. సమాచారం లాగే చాన్స్ ఉందని ఆర్మీ హెచ్చరించింది. బాబాలు, ఆధ్యాత్మికవేత్తల పేర్లతో కూడా ఇటీవల ఆర్మీ జవాన్లను ట్రాప్ చేయడానికి పాక్ కుట్ర చేస్తోందని భారత ఆర్మీ అలర్ట్ చేసింది.ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.