New Delhi, April 25: పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావెద్ బద్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ సైన్యంతో పోరాడే శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తి పాకిస్తాన్ ఆర్మీకి లేదని కుండబద్దలు కొట్టారు. భారత్‌తో పోరాడే మందుగుండు సామాగ్రి, ఆర్థిక శక్తి పాకిస్థాన్‌కు లేదని ఆ దేశ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఇద్దరు సీనియర్ జర్నలిస్టులతో చెప్పినట్లు UK ఆధారిత పాకిస్థాన్ మీడియా 'UK44' తెలిపింది.
'భారత ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ సరితూగలేదు. భారత్‌తో పాక్ యుద్ధం చేసే పరిస్థితి లేదు. ట్యాంకులు కూడా పనిచేయడం లేదు. ఫిరంగులను తరలించడానికి డీజిల్ కూడా లేదు' అని బజ్వా తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఆ దేశ సైనిక సామర్థ్యాలపై ప్రశ్నలు లేవెనత్తేలా, సైన్యం నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయి. ఏదేమైనా ఆయన చెప్పిన దాంట్లో మాత్రం వాస్తవం ఉండనే ఉంది.పాకిస్తాన్ కమాండర్స్ సదస్సులోనే బజ్వా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
భారత్‌తో పాకిస్తాన్ శుత్రుత్వం పెంచుకోకుండా స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరుచుకుంటేనే మంచిదని ఆయన అన్నారు. భారత్‌తో సుదీర్ఘ విరోధం పాకిస్తాన్‌ను హరించివేస్తుందని పేర్కొన్నారు. భారత్‌తో పోరాడేందుకు అవసరమైన ఆయుద సంపద, ఆర్థిక బలం పాకిస్తాన్‌కు లేవని, అందుకే కశ్మీర్ సమస్యపై ఇరుదేశాలు శాశ్వత పరిష్కారానికి వచ్చే విషయంపై ఆలోచిస్తున్నట్లు కూడా బజ్వా పేర్కొన్నారు.
పాకిస్తాన్ జర్నలిస్టులు- హమీద్ మీర్ మరియు నసీమ్ జెహ్రా- ఒక ప్రదర్శనలో మాట్లాడుతూ, 2021లో జనరల్ బజ్వా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో రహస్య చర్చలు జరిపారని, 2021లో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ పర్యటనకు ఎలా ప్లాన్ చేశారో వెల్లడించారని చెప్పారు.
భారత్‌తో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌లో పర్యటించాల్సి వచ్చింది. విదేశాంగ శాఖకు ఈ విషయం తెలియడంతో, వారు ఈ విషయం గురించి తెలియక ఇమ్రాన్ ఖాన్ వద్దకు వెళ్లారు. దాని గురించి తనకు తెలుసని, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌తో చర్చలు జరుగుతున్నాయని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు, అయితే ప్రధాని మోదీ పాకిస్తాన్ పర్యటనపై తనకు ఎటువంటి ధృవీకరణ లేదని ఇమ్రాన్ అన్నారని మీర్ అన్నారు.
డాన్ యొక్క నివేదిక ప్రకారం, భారతదేశంతో "ఆల్-అవుట్ వార్" ముప్పు పాకిస్తాన్ ఎన్నికలను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తున్న భద్రతా సంబంధిత సమస్యలలో ఒకటి.సార్వత్రిక ఎన్నికలను ఆలస్యం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఈ నివేదికను పాకిస్థాన్ సుప్రీంకోర్టుకు సమర్పించింది. హమీద్ మీర్ ఇటీవల వెల్లడించిన వివరాలతో, భారత సైనికులను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సైన్యం సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ సంక్షోభంతో ప్రజల జీవితాలు దుర్బరంగా మారాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి, ఉద్యోగాలు పోయి అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు.