Police (Photo Credits: IANS)

New Delhi, Jan 24: దేశ రాజ‌ధాని డిల్లీలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు క‌ల‌క‌లం రేపాయి. ఢిల్లీలో ఖాన్ మార్కెట్ ప్రాంతంలో శ‌నివారం అర్ధ‌రాత్రి దాటిన తర్వాత ఒంటి గంట స‌మ‌యంలో తుగ్ల‌క్ రోడ్ పోలీస్ స్టేష‌న్‌కు ఓ ఫిర్యాదు అందింది. ఖాన్ మార్కెట్ మెట్రో స్టేష‌న్ (Khan Market metro station) ద‌గ్గ‌ర ఎవ‌రో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు (Pakistan zindabad Slogans) చేస్తున్నారని ఫిర్యాదు చేసిన ఓ వ్య‌క్తి వెల్ల‌డించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వెంట‌నే అక్క‌డికి వెళ్లారు.

ఈ నినాదాలు చేసిన ముగ్గురు మ‌హిళ‌లు, ఇద్ద‌రు పురుషుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లంతా యులు బైక్స్ తీసుకొని అక్క‌డ చక్క‌ర్లు కొడుతున్నారు. వాళ్ల‌ను పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లి ప్ర‌శ్నించ‌గా.. తాము సైట్ సీయింగ్ కోసం ఇండియాకు వ‌చ్చామ‌ని చెప్పారు. బ్లూ యులు బైక్స్‌పై రేసింగ్ చేస్తున్నామ‌ని, ఈ సంద‌ర్భంగా ఒక‌రినొక‌రం త‌మ దేశాల పేర్లు పెట్టుకొని పిలుచుకున్నామ‌ని తెలిపారు.

అందులో పాకిస్థాన్‌కు చెందిన వ్య‌క్తి కూడా ఉండ‌టంతో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. వాళ్ల‌ను విచారించిన త‌ర్వాత పోలీసులు మీడియాతో మాట్లాడారు. ఆ టూరిస్టులు మామూలుగానే ఆ నినాదాలు చేశార‌ని పోలీసులు కూడా స్ప‌ష్టం చేశారు. దీనిపై ఇన్విస్టిగేషన్ జరుగుతోంది.

Here's ANI Tweet

గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, భద్రతా దళాలు దేశ రాజధానిలో తమ అప్రమత్తతను పెంచుతున్నాయి. ఎన్ఐఏ నివేదికల ప్రకారం, ఖలీస్తానీ ఉగ్రవాదులు మరియు నక్సల్స్ కొనసాగుతున్న రైతు నిరసనలను ఉగ్రవాద దాడులకు మరియు ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆ రోజున ప్రతిపాదిత ట్రాక్టర్ ర్యాలీపై ఢిల్లీ పోలీసులు, రైతు సంఘాల మధ్య గొడవ జరుగుతోంది. పోలీసులు అనుమతి ఇచ్చారని యూనియన్లు ఆరోపించాయి, కాని ఢిల్లీ పోలీసులు ఈ నివేదికలను ఖండించారు.