New Delhi, July 02: మీ ఆధార్, పాన్ కార్డుతో లింక్ (PAN- Aadhaar linking) చేసుకున్నారా? లేదంటే వెంటనే చేసుకోండి.. మీ పాన్-ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి జూన్ 30 చివరి రోజు. అయితే ఇప్పుడు గడువు ముగిసింది. ఇప్పటికీ మీరు పాన్ (PAN), ఆధార్ (Aadhar) లింక్ చేయకుంటే.. మీరు డబుల్ ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు సకాలంలో కార్డును లింక్ చేయని పక్షంలో రూ. 500 వరకు చెల్లించాలి. ఒకవేళ గడువు దాటితే.. మీరు డబుల్ ఫైన్ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది(Double fine). అంటే రూ. 1000వరకు జరిమానా పడుతుంది. కాకపోతే.. ఆధార్, పాన్ కార్డు లింక్ గడువు ముగిసింది.
అయితే అందులో కొద్దిగా రిలీఫ్ పొందవచ్చు. ఎందుకంటే.. మార్చి 31, 2023 వరకు పాన్, ఆధార్ లింక్ పొడిగించి ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం.. మీరు జూన్ 30, 2022 లేదా అంతకంటే ముందే మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయాలి. ఒకరోజు దాటినా మీరు రూ.500 జరిమానా చెల్లించాలి. కానీ, మీరు జూన్ 30న మీ కార్డ్‌లను లింక్ చేయడం మిస్ అయితే.. రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆధార్‌ని మీ పాన్‌కి ఎలా లింక్ చేయాలో తెలియడం లేదా? అయితే ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.
మీ పాన్‌ని ఆధార్‌కి ఎలా లింక్ చేయాలంటే :
– ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి https://incometaxindiaefiling.gov.in/ లింక్ నొక్కండి.
– మీ పాన్ కార్డ్‌ని ఉపయోగించి మీ అకౌంట్ నమోదు చేసుకోండి.
– మీ పాన్ (శాశ్వత అకౌంట్ నెంబర్) మీ యూజర్ ఐడీ అవుతుంది.
– మీరు మీ అకౌంట్ విజయవంతంగా నమోదు చేసుకున్నాక.. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
– ఆ తర్వాతే లాగిన్ అవ్వండి. లాగిన్ చేసినప్పుడు, మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయమంటూ పాప్-అప్ విండో కనిపిస్తుంది.
– మీకు ఆ ఆప్షన్ కనిపించకపోతే.. మెనూ బార్‌లోని ‘Profile Settings’కి వెళ్లండి. అక్కడే ‘Link Aadhaar’పై క్లిక్ చేయండి.
– పాన్ వివరాల ప్రకారం.. పేరు పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు కనిపిస్తాయి.
– మీ ఆధార్‌లో కనిపించే వివరాలు, స్క్రీన్‌పై కనిపించే పాన్ వివరాలు ఒకేలా ఉన్నాయో లేదో చెక్ చేయండి.
– సమాచారం సరిపోలడం లేదంటే.. మీరు డాక్యుమెంట్లలో ఎందులోనైనా మార్చుకోవాలి.
– అన్ని వివరాలు సరిగ్గా ఉంటే.. ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. “Link Now” బటన్‌పై క్లిక్ చేయండి.
– ఈ దశలను సరిగా ఫాలో కావాలి. మీ ఆధార్, మీ పాన్‌కి విజయవంతంగా లింక్ అయినట్టుగా పాప్-అప్ వస్తుంది.