Petrol price in India: చల్లారని పెట్రో మంట, జూలై నెలలో మూడోసారి పెరిగిన పెట్రో ధరలు, రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ. 9.12 ధర పెంపు, లీటరుకు రూ. 8.71 పెరుగుదల నమోదు చేసిన డీజిల్‌ ధర
Petrol Pump (Photo Credits: PTI)

New Delhi, July 3: దేశంలో పెట్రోలు ధరలు (Petrol and Diesel Prices in India) పెరుగుతూనే ఉన్నాయి. చమురు కంపెనీలు జులైలో మూడోసారి పెట్రోలు ధరలు (Fuel Prices Hiked Again) పెంచాయి. లీటరు పెట్రోలుపై రూ. 36 పైసలు, లీటరు డీజిల్‌పై 20 పైసల వంతున పెంచాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్ రూ103.41; డీజిల్‌ రూ.97.40 పైసలకు చేరుకుంది. తిరుపతి, విజయవాడలలో డీజిల్‌ ధర సెంచరీకి చేరువుగా వచ్చాయి.

ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 35 సార్లు పెట్రోలు ధరను పెంచుతూ పోయారు. మొత్తంగా రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ. 9.12 ధరను పెంచారు. ఇదే సమయంలో డీజిల్‌ ధర లీటరుకు రూ. 8.71 పెరిగింది. గత రెండు నెలలుగా సగటున రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

డెల్టా వేరియంట్‌తో ప్రపంచం మళ్లీ డేంజర్ జోన్‌లోకి, హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌, దేశంలో కొత్తగా 43,071 కరోనా కేసులు, ఊబకాయులకు కరోనాతో అంత ప్రమాదం లేదని తేల్చిన అధ్యయనం

ఈ వారం వియన్నాలో ఒపెక్ దేశాలు సమావేశమయ్యాయి. ఇందులో రాబోయే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ముడి చమురు ఉత్పత్తిని పెంచే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, 11 గంటల పాటు సమావేశం జరిగినా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ముడి చమురు మార్కెట్లను నిరాశపరిచింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి, బ్రెంట్ ముడి బ్యారెల్‌కు 76.17 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇది ముందు రోజు కంటే 0.33 డాలర్లు ఎక్కువ. అదేవిధంగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ముడి చమురు బ్యారెల్‌కు 0.07 డాలర్లు తగ్గి.. 75.16 వద్ద ముగిసింది.

తెలుగు రాష్ట్రాల్లో వివిధ నగరాల్లో లీటరు పెట్రోలు ధరలు

హైదరాబాద్‌ : పెట్రోలు రూ. 103.47, డీజిల్‌ రూ. 97.46

వరంగల్‌: పెట్రోలు రూ. 103.02 , డీజిల్‌ రూ. 97.03

విశాఖపట్నం:  పెట్రోలు రూ. 105.04,  డీజిల్‌ రూ. 98.44

విజయవాడ పెట్రోలు రూ. 105.72,  డీజిల్‌ రూ. 99.12

తిరుపతి : పెట్రోలు రూ.106.41, డీజిల్‌ రూ. 99.70

దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు

ఢిల్లీలో పెట్రోల్‌ రూ.99.51.. డీజిల్‌ రూ.89.36

ముంబైలో పెట్రోల్‌ రూ.105.98.. డీజిల్‌ రూ.96.91

కోల్‌కతా పెట్రోల్ రూ.99.44.. డీజిల్‌ రూ.92.27

చెన్నైలో పెట్రోల్‌ రూ.100.44.. డీజిల్‌ రూ.94.72

బెంగళూరులో పెట్రోల్ రూ.102.84.. డీజిల్ రూ.94.54

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.103.41.. డీజిల్‌ రూ.97.40

పాట్నాలో పెట్రోల్ రూ.101.62.. డీజిల్‌ రూ.94.76

చండీగఢ్‌లో పెట్రోల్‌ రూ.95.70.. డీజిల్‌ రూ.89

భోపాల్‌లో రూ.107.80.. డీజిల్‌ రూ.98.13

లక్నోలో పెట్రోల్‌ రూ.96.65.. డీజిల్‌ రూ.89.75

రాంచీలో పెట్రోల్‌ రూ.94.89.. డీజిల్‌ రూ.94.31