Fuel Price Hike: మళ్లీ పెట్రోల్, డీజీల్‌పై 35 పైసలు పెంపు, పెరుగుతున్న రేట్లతో ఆందోళన చెందుతున్న సగటు వాహనదారుడు, ప్రధాన నగరాల్లో లీటర్ ధరలు ఇలా ఉన్నాయి
Petrol Price In India | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, Oct 17: పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. విరామం లేకుండా రోజూ పెరుగుతున్న రేట్లతో (Fuel Price Hike) సగటు వాహనదారుడు ఆందోళన చెందుతున్నాడు. ఆదివారం దేశవ్యాప్తంగా స్వల్పంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Fuel Prices Hiked Again) పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, అలాగే డీజీల్‌పై కూడా 35 పైసలు పెరిగింది.

పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు... ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.84, డీజిల్ రూ.94.57, ముంబైలో లీటరు పెట్రోల్ రూ.111.77, డీజిల్ రూ.102.52, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ రూ.106.44, డీజిల్ రూ.97.68, బెంగళూరులో లీటరు పెట్రోలు రూ.109.37, లీటరు డీజిలు రూ.100.37 ఉంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటేసింది. ఏపీలోని విజయవాడ, గుంటూరుల్లో రూ.112.38గా ఉంది. అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్కును క్రాస్ చేసేసింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.77గా ఉండగా.. ఢిల్లీలో రూ.105.84గా ఉంది.

రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, భారీ వర్షాలకు వణుకుతున్న 4 రాష్ట్రాలు, కేరళలో 8 మంది మృతి, హైదరాబాద్‌పై విరుచుకుపడిన వరదలు

పెట్రోలు ధరలు ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతుండటంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ ఓ శుభవార్త చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, పెట్రోలు, డీజిలుపై పన్నులను తగ్గించి, తద్వారా ధరలు తగ్గే విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికల అనంతరం సమీక్ష జరుగుతుందన్నారు.కర్ణాటకలోని సిందగి, హంగల్ శాసన సభ నియోజకవర్గాలకు అక్టోబరు 30న ఉప ఎన్నికలు జరుగుతాయి. నవంబరు 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బసవరాజ్ బొమ్మయ్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.

డెంగ్యూ బారీన పడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎయిమ్స్‌లో చికిత్స తీసుంటున్న ప్రముఖ ఆర్థికవేత్త, నిలకడగా ఆరోగ్యం

కర్ణాటకలో పెట్రోలుపై పన్నులను తగ్గించే ఆలోచన ఉందా? అని ప్రశ్నించినపుడు బొమ్మయ్ స్పందిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇది ఆధారపడి ఉంటుందని తాను ఇప్పటికే చెప్పానన్నారు. ఉప ఎన్నికల తర్వాత తాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష జరుపుతానని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే, పన్నులను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. ఆర్థిక శాఖను కూడా బొమ్మయ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోలు, డీజిలు ధరలు తగ్గే విధంగా రాష్ట్ర పన్నులను తగ్గిస్తామని కూడా బసవరాజ్ బొమ్మయ్ ఈ నెల 10న చెప్పారు.

ప్రధాన నగరాల్లో లీటర్ ధరలు ఇలా...

హైదరాబాద్: పెట్రోల్ – రూ.110.09, డీజిల్ – రూ.103.18

విజయవాడ: పెట్రోల్ – రూ.112.38, డీజిల్ – రూ.104.83

గుంటూరు: పెట్రోల్ – రూ.112.38, డీజిల్ – రూ.104.83

విశాఖపట్నం: పెట్రోల్ – రూ.110.90, డీజిల్ – రూ.103.43

ఢిల్లీ: పెట్రోల్ – రూ.105.84, డీజిల్ – రూ.94.57

ముంబై: పెట్రోల్ – రూ.111.77, డీజిల్ – రూ.102.52

చెన్నై: పెట్రోల్ – రూ.103.01, డీజిల్ – రూ.98.92

బెంగళూరు: పెట్రోల్ – రూ.109.53, డీజిల్ – రూ.100.37