Petrol Pump (Photo Credits: PTI)

New Delhi, March 25: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు (Fuel Prices) కొనసాగుతోంది. నాలుగు రోజుల్లో మూడోసారి ధరలను పెంచాయి ఆయిల్ సంస్థలు(Oil Companies). ధరల పెంపునకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన చమురు కంపెనీలు...తాజాగా లీటరు పెట్రోల్‌(Petrol), డీజిల్‌ (Diesel)పై 80 పైసల చొప్పున వడ్డించాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) లీటరు పెట్రోల్‌ ధర రూ.97.81, డీజిల్‌ ధర రూ.89.07కు చేరాయి. ముంబైలో పెట్రోల్‌ రూ.112.51, డీజిల్‌ రూ.96.70గా ఉన్నాయి. ముంబై(Mumbai)లో పెట్రోల్‌ రూ.112.51 (84 పైసలు), డీజిల్‌ రూ.96.70గా (85 పైసలు) ఉన్నాయి. చెన్నైలో 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్‌ రూ.103.67, డీజిల్‌ రూ.93.71, కోల్‌కతాలో (Kolkata) పెట్రోల్‌ రూ.106.34 (84 పైసలు), డీజిల్‌ రూ.91.42 (80 పైసలు)కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున అధికమయ్యాయి. దీంతో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్‌ రూ.97.23కు చేరాయి.

కాగా, దేశంలో గతేడాది నవంబర్‌ 4వ తేదీ తర్వాత మొదటిసారిగా మార్చి 22న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికమయ్యాయి. మార్చి 23న కూడా చమురు కంపెనీలు ధరలు పెంచాయి. తాజా పెంపుతో మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్‌, డీజిలు ధరలు రూ.2.40 చొప్పున పెరిగాయి.

Petrol, Diesel Price Reduction: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రం కీలక నిర్ణయం, పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గింపు

అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిపోవడంతో చమురు కంపెనీలు లీటరు డీజిలుపై రూ.13.1 నుంచి రూ.24.9 వరకు, పెట్రోలుపై రూ.10.6 నుంచి రూ.22.3 వరకు వడ్డించే అవకాశం ఉన్నదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధరలపెంపు రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగే అవకాశముందని నిపుణులు అంటున్నారు.