Petrol, diesel, prices to go up from April 1 as pumps to sell BS6 fuel (Photo-Getty)

Mumbai, Febuary 28: వాహనదారులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Price) పెరగనున్నాయి. ఏప్రిల్ 01 నుంచి ధరలు పెరగబోతున్నట్లు వ్యాపారనిపుణులు వెల్లడిస్తున్నారు. దీనికంతటికి కారణం BS-6 ఇంధనం. ప్రస్తుతం యూరో -4 లేదా భారత్ స్టేజ్ (BS-6) ఇంధానాన్ని వాడుతున్నాం.

BS-6 వాహనాలు అందుబాటులో వచ్చినప్పటి నుంచి BS-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగించడం జరుగుతోంది. కానీ కాలుష్యం మాత్రం కంట్రోల్ కావడం లేదు. దీంతో నరేంద్ర మోదీ సర్కార్ ఏప్రిల్ 01 నుంచి దేశ వ్యాప్తంగా BS - 6 ఇంధనాన్ని అందుబాటులోకి రానుంది.

ఇక మీ ఇంటికే పెట్రోల్, డీజిల్, ఎంత కావాలంటే అంత ఆర్డర్ చేసుకోవచ్చు

ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 ఫ్యూయెల్ సప్లై చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. బీఎస్-4 ప్రమాణాల ఇంధనం వల్ల కాలుష్యం ఎక్కువ వెలువడుతుందని, అందుకే 2020 ఏప్రిల్ నుంచి బీఎస్-6 ఇంధనం వాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్-4 తర్వాత బీఎస్-5 ఉన్నా... కేంద్రం నేరుగా బీఎస్-6 (BS6 fuel) ఇంధనానికి మారాలని నిర్ణయించింది.

బీఎస్-4 ఇంధనంతో పోలిస్తే బీఎస్-6 ఫ్యూయెల్‌తో కాలుష్యం తగ్గుతుంది. ప్రస్తుతం బీఎస్-4 ఫ్యూయెల్ వల్ల ప్రమాదకరమైన సల్ఫర్ ఉద్గారాలు 50 పార్ట్స్ పర్ మిలియన్-ppm ఉన్నట్టు కాలుష్యం లెక్కలు చెబుతున్నాయి. అదే బీఎస్-6 ఇంధనాన్ని ఉపయోగిస్తే సల్ఫర్ ఉద్గారాలు 10 పీపీఎంకు తగ్గుతాయి.

ప్లాస్టిక్‌తో ఇంధనం తయారీ, లీటరు ధర రూ. 40 మాత్రమే

కాబట్టి ముందే ప్రకటించిన గడువు ప్రకారం ఏప్రిల్ 1 నుంచి దేశమంతా బీఎస్-6 ఫ్యూయెల్ మాత్రమే లభిస్తుంది. BS - 6 ఇంధన ఉత్పత్తి కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో ఏప్రిల్ 01 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలకు మరలా రెక్కలు వస్తాయని, పెరుగుదల లీటర్‌కు 70 పైసల నుంచి ఒక రూపాయి మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

శుద్ధి కర్మగారాలను అప్ గ్రేడ్ చేయడానికి ఇప్పటి వరకు దాదాపు రూ. 17 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు IOC కంపెనీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ వెల్లడించారు. బీఎస్-6 ఫ్యూయెల్ కోసం రిఫైనరీలను అప్‌గ్రేడ్ చేసేందుకు ఆయిల్ కంపెనీలన్నీ రూ.35,000 కోట్లు ఖర్చు పెట్టాయని సమాచారం.

ప్రభుత్వ శుద్ధి కర్మాగారాలను అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు డబ్బులు ఖర్చు పెట్టాయన్నారు. మార్చి 01వ తేదీ నుంచి కొత్త ఇంధనాలు మాత్రమే సప్లై అవుతాయన్నారు. ధరల పెరుగుదల వినియోగదారులపై అంతగా ఉండదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బీఎస్-6 ఇంధనం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరుగుతాయన్న స్పష్టత లేదు. కానీ... లీటర్‌పై 70 పైసల నుంచి రూపాయి వరకు పెరగొచ్చని అంచనా.