PM Kisan KYC Date Extended: పీఎం-కిసాన్ రైతులకు గుడ్ న్యూస్, ఈ-కేవైసీ గడువును మే 22, 2022 వరకు పొడిగించిన కేంద్రం, ఈ-కేవైసీ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ మీకోస్
Image used for representational purpose. | Photo Wikimedia Commons

New Delhi, Mar 30: పీఎం-కిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ ఈ-కేవైసీ గడువు తేదీని పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ-కేవైసీ గడువును మే 22, 2022 వరకు పొడగిస్తున్నట్లు (PM Kisan KYC Date Extended) కేంద్ర ప్రభుత్వం అధికారిక పోర్టల్ ద్వారా తెలిపింది. ఇంతక ముందు ఈ-కేవైసీ (PM Kisan KYC) గడువు మార్చి 31, 2022 వరకు ఉండేది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద డబ్బులు పొందుతున్న రైతులు కచ్చితంగా ఆధార్ ఈ-కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. పీఎఫ్ ఖాతాదారులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్, రూ.2.5 ల‌క్ష‌లు దాటితే ప‌న్ను కట్టాల్సిందే, పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకోండి

ఈ-కేవైసీ చేసుకోలేకపోయినట్లయితే పీఎం కిసాన్ నగదు మీ ఖాతాలో జమ కాదు. కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించిందని వేచి చూడకుండా.. వెంటనే ఈ పని పూర్తి చేసుకోవడం ఉత్తమం. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి రైతులు ఇకేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేయొచ్చు. ఈ పథకం కింద, సంవత్సరానికి ₹6,000 మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ₹2,000లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తదుపరి విడత డబ్బులను వచ్చే నెలలో రైతులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఈ-కేవైసీ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలి?

పీఎం-కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్‌లో ఈ-కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది.

ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆధార్ కార్డు నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేయండి.

మీ ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నంబర్ నమోదు చేయండి.

ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.

'సబ్మిట్' పై క్లిక్ చేస్తే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.