New Delhi January 09:  దేశంలో కరోనా విజృంభణపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమీక్ష(PM Modi chairs review meeting) నిర్వహించారు. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారుల(Health Ministry Of India)తో పాటూ, కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు, ఇతర శాఖల అధికారులు, నిపుణులతో ప్రధాని వర్చువల్ గా చర్చించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కట్టడి చర్యలపై అభిప్రాయాలను తీసుకున్నారు. అటు Covid casesదేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్(Corona vaccination) పై కూడా ప్రధాని చర్చించారు. ఇప్పటికే 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ జరుగుతుండగా, సోమవారం నుంచి 60 ఏళ్ల పైబడ్డవారికి ప్రికాషనరీ డోసులు(Precautionary dose) ఇవ్వనున్నారు. దీనిపై కూడా సమావేశంలో చర్చించారు.

రాష్ట్రాల వారీగా కరోనా పరిస్థితులపై త్వరలోనే ముఖ్యమంత్రులతో సమావేశమవుతానని ప్రధాని తెలిపారు. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలు, కరోనా కట్టడి కోసం రాష్ట్రాలు చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలపై చర్చించస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లో నాన్ కోవిడ్(Non Covid) సేవలకు అంతరాయం కలుగకుండ చర్యలు తీసుకోవాలని ప్రధాని తెలిపారు. జిల్లా స్థాయిలోఆస్పత్రుల్లో సౌకర్యాలు, మౌళిక సదుపాయాలపై దృష్టిసారించాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు, కేసులు అధికంగా వస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

థర్డ్ వేవ్ (Third wave)ప్రభావంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో సరిపడా బెడ్లు, మందులు, ఆక్సీజన్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు ప్రధాని. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోడీ సమీక్ష జరిపారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, గర్భిణులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ వెసులుబాటు ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాగే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్‌ జోన్లలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్‌ జాబితా నుంచి తొలగించాకే కార్యాలయానికి రావాలని సూచించింది.

3rd Wave in India: సెకండ్ వేవ్ కంటే ఎక్కువ తీవ్రతతో థర్డ్ వేవ్, జనవరి మొదటివారంలోనే ఆర్ నాట్ వాల్యూ 4, రానున్న మరింత రోజుల్లో మరింత పెరిగే అవకాశం

కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ అంశాలపై అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో సెంట్రల్ హెల్త్ మినిస్టర్ మన్సుక్ మాండవియా రివ్యూ చేయనున్నారు. అటు దేశంలో కొవిడ్ యాక్టీవ్ కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరింది. చాలా రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం దాటింది. అటు ఒమిక్రాన్ వ్యాప్తి వల్లనే కరోనా కేసులు అధికంగా ఉన్నాయని, సాంకేతికంగా 3వేలకు పైగా కేసులు గుర్తించినప్పటికీ, వాస్తవంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు