Panaji December 19: వచ్చే ఏడాది జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Five State assembly elections) నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో హడావుడి మామూలుగా లేదు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh)లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ(Narendra Modi) తాజాగా గోవా(Goa)లో పర్యటించారు. అక్కడ రూ. 600 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

ఆదివారం జరిగిన గోవా లిబ‌రేష‌న్ డే(Goa liberation Day) ఉత్స‌వాల్లో పాల్గొన్నారు ప్ర‌ధాని మోదీ(PM Modi). కొన్ని శ‌తాబ్దాల క్రితం దేశంలోని ప్ర‌ధాన ప్రాంతాల‌న్నీ మొగ‌లుల పాల‌న‌లో ఉండ‌గా, గోవా మాత్రం పోర్చుగ‌ల్ పాల‌న‌లో ఉండేద‌ని ప్ర‌ధాని గుర్తుచేశారు. కానీ, శ‌తాబ్దాలు గ‌డిచినా గోవా త‌న భారతీయ‌త‌ను మ‌రువ‌లేద‌ని, భార‌త దేశం కూడా గోవా త‌మ రాష్ట్ర‌మ‌నే సంగ‌తిని మ‌ర్చిపోలేద‌ని ఆయన వ్యాఖ్యానించారు.

Kashi Vishwanath Corridor: కాశీలో ప్ర‌తి రాయి శివుడే.. కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ, అంద‌రికీ కాశీ విశ్వ‌నాథుడి ఆశీస్సులు ఉండాలన్న భారత ప్రధాని

గోవా మాజీ ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్(Manohar parikkar) ప్ర‌వ‌ర్త‌న ద్వారా గోవా(Goa) ప్ర‌జ‌లు ఎంత నిజాయితీప‌రులో, ప్ర‌తిభావంతులో, ఎలా క‌ష్ట‌ప‌డుతారో దేశం మొత్తం చూసింద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. ఒక వ్య‌క్తి త‌న రాష్ట్రం కోసం, ప్ర‌జ‌ల కోసం త‌న ఆఖ‌రి శ్వాస వ‌ర‌కు పోరాడుతాడ‌నే విష‌యాన్ని మ‌నం మ‌నోహ‌ర్ పారిక‌ర్ జీవితం ద్వారా చూశామ‌ని చెప్పారు. గోవా రాష్ట్రానికి అన్ని అంశాల్లో అగ్ర‌స్థాన‌మేన‌న్నారు. సుప‌రిపాల‌న‌లో, త‌ల‌స‌రి ఆదాయంలో ఇంకా చాలా అంశాల్లో గోవాదే ముందంజ అని ప్ర‌శంసించారు.

అదేవిధంగా గోవాలో సింగిల్ డోస్ వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యింద‌ని ప్ర‌ధాని తెలిపారు. గోవాలో అర్హులైన వారిలో 100 శాతం మందికి తొలి డోస్ వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యింద‌ని చెప్పారు. అందుకు గోవా స‌ర్కారును అభినందించారు. గోవా అభివృద్ధి కోసం సీఎం ప్ర‌మోద్ సావంత్ భారీ ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నార‌ని ప్ర‌ధాని ప్రశంసించారు..