PM Modi Address in Parliament: వందేండ్ల వ‌ర‌కు కాంగ్రెస్ అధికారంలోకి రాదు, పార్లమెంట్‌లో ఏకి పారేసిన ప్రధాని మోదీ, లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించిన ఉభయ సభలు
PM Narendra Modi Address in Parliament (Photo Credits: Twitter/ ANI)

New Delhi, Fb 7: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi Address in Parliament) ప్రసంగించారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్‌కు ప్రధాని నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ (PM Narendra Modi Address in Parliament) ప్రపంచంలో భారత్‌ లీడర్‌గా ఎదుగుతోందన్నారు. అయితే మోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్‌ సభాపక్షనేత అధిర్‌ రంజన్‌ అడ్డుకున్నారు. దీంతో కొందరు ఇంకా 2014లోనే ఉన్నారని అధిర్‌ రంజన్‌ను ఉద్దేశించి మోదీ పంచ్‌ వేశారు. 1972లో చివరిసారి బెంగాల్లో కాంగ్రెస్‌ గెలిచిందంటూ అధిర్‌కు కౌంటర్‌ వేశారు.

ఈ నేపథ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేశారు. ఆ పార్టీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టారు. ఏయే అంశాల‌పై పోరాటం చేయాల‌న్న జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు లేద‌ని మోదీ విమ‌ర్శించారు. కాంగ్రెస్ స‌భా ప‌క్ష నేత అధిర్ రంజ‌న్ చౌద‌రికి మోదీ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చినా కూడా అక్క‌డి ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వ‌లేదు. ఎన్ని ఓట‌ములు ఎదురైనా కాంగ్రెస్ నేత‌ల తీరు మాత్రం మార‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. వందేండ్ల వ‌ర‌కు కాంగ్రెస్ అధికారంలోకి రాదు అని మోదీ స్ప‌ష్టం చేశారు.

కరోనా వ్యాక్సిన్‌కు ఆధార్ తప్పనిసరి కాదు, ఎవ‌రి వ‌ద్ద ఆధార్ ఇవ్వాల‌ని వ‌త్తిడి చేయ‌రాదని అధికారుల‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

గ‌త రెండేండ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారితో భార‌త్ పోరాడుతోంది. కొవిడ్‌ను కూడా కొంద‌రు రాజ‌కీయం చేస్తున్నారు. క‌రోనా క‌ష్ట‌కాలం నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. క‌రోనా స‌మ‌యంలో 80 కోట్ల మందికి ఉచిత రేష‌న్ ఇచ్చామ‌న్నారు. పూర్తి సంక‌ల్పంతో దేశం మ‌రింత ముందుకెళ్లాలి. పేద‌ల ఇండ్ల నిర్మాణం మ‌రింత వేగంగా పూర్తి చేయాల‌న్నారు. గ్రామాల్లో ప్ర‌తి ఇంటికీ మ‌రుగుదొడ్డి నిర్మించామ‌ని గుర్తు చేశారు. గ్యాస్ క‌నెక్ష‌న్ ఇచ్చి పేద మ‌హిళ‌ల బాధ‌లు తొల‌గించామ‌న్నారు. భార‌త్ వేగంగా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లంగా త‌యారైంద‌న్నారు. ఎగుమ‌తులు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ప్ర‌పంచంలో భార‌త్ లీడ‌ర్‌గా ఎదుగుతోంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్‌లో కళ్లు తిరిగిపడిపోయారు. ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు.

దేశంలో గత 24 గంటల్లో 83,876 మందికి కరోనా, నిన్న‌ 895 మంది మృతి, రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతం

కేంద్రం కేటాయించిన జడ్‌ కేటగిరి భద్రతను స్వీకరించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకిహోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఒవైసీ కాన్యాయ్‌పై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. రాజ్యసభలో దీనిపై ప్రకటన చేసిన షా.. ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేశామని, ఆల్టో కారు, పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై టీడీపీ విషప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి బలంగా తిప్పికొట్టారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అవాస్తవాలను వల్లేవేశారు .సినిమా టికెట్లు సహా పలు అంశాలపై తప్పుడు ప్రచారం చేయడానికి కనకమేడల ప్రయత్నించారు. దీనిపై స్పందించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ పాలన కంటే వైఎస్సార్‌సీపీ పాలన వెయ్యిరెట్లు గొప్పగా ఉందని ఆయన స్పష్టం చేశారు.