Screengrab of video showing PM Modi stumbling on stairs | (Photo Credits: Twitter)

New Delhi, December 14: కాన్పూర్ (Kanpur) పర్యటనలో ప్రధాని మోడీకి (PM Modi) పెను ప్రమాదం తప్పింది. గంగానది (Ganga River) మెట్లు ఎక్కుతూ ప్రధాని జారీ పడ్డారు. అటల్ ఘాట్ వద్ద ఒక అడుగు తప్పి మెట్లపై పడిపోయారు అదృష్టవశాత్తు ఆయనకు గాయాలేం కాలేదు. వెంట ఉన్న సెక్యూరిటీ త‌క్ష‌ణ‌మే ఆయన్ను పైకి లేపారు.

ఈ ఘటనలో ఆయనకు ఎటువంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత యథావిధిగా అన్ని కార్యక్రమాల్లోనూ మోడీ పాల్గొన్నారు. నమామి గంగే ప్రాజెక్ట్ కింద గంగా నది పరిశుభ్రతను పరిశీలించడానికి ప్రధాని అక్కడికి వెళ్ళారు.  పవిత్ర గంగానదిలో ప్రధాని మోడీ బోటు షికారు

మోడీ సర్కార్ నమామి గంగ ప్రాజెక్టు పేరిట గంగానది ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, యూపీలో కాన్పూర్‌లోని అటల్ ఘాట్ (Atal Ghat) వద్ద ప్రధాని నరేంద్ర మోదీ పవిత్ర గంగానదిలో విహరించారు. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఎన్డీఏ మిత్రపక్ష నేతలు మోడీ వెంట ఉన్నారు.

Watch Video of PM Modi Falling on Stairs of Ganga Ghat

యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ గంగానదీలో పర్యటించారు.గంగానది పరివాహక ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పర్యటనకు గైర్హాజరయ్యారు. ‘నమామి గంగే’ పథకం సమీక్షా కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గంగా నదిలో ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఎంతవరకూ విజయవంతమైందనే విషయాన్ని ప్రత్యక్షంగా అంచనా వేశారు.