PM Narendra Modi Holds COVID-19 Review Meeting with Chief Ministers of Around 10 States (Photo-ANI)

New Delhi, August 11: కరోనా నివారణ చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ (PM Modi COVID-19 Review) నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా (Coronavirus) మ‌హ‌మ్మారి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్ర‌ధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కరోనా పరిస్థితిపై తెలుసుకున్నారు.

ఈ భేటీలో వివిధ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రతపై ప్ర‌ధాని సమీక్ష చేశారు. లాక్‌డౌన్‌ (Lockdown) తర్వాత పరిస్థితులు, అన్‌లాక్‌ 3 (Unlock 3) అమలు జరుగుతున్న తీరుతెన్నులపై సీఎంలను ప్ర‌ధాని అడిగి తెలుసుకున్నారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు.

Update by ANI

ఈ సమీక్షలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులతోపాటు కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్, బీహార్‌‌ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇక‌ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వైద్య ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. తెలంగాణ త‌ర‌ఫున సీఎం కేసీఆర్‌తోపాటు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. దేశంలో తాజాగా 53,601 కరోనా కేసులు నమోదు, 22 లక్షలు దాటిన మొత్తం కరోనా కేసులు, గత 24 గంటల్లో 871 మరణాలు, ఇప్పటివరకు కోవిడ్-19తో 45,257 మంది మృతి

ఏపీ నుంచి సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.