PM Narendra Modi (Photo Credits: ANI)

New Delhi, December 25: రైతులకు మోడీ సర్కారు శుభవార్తను చెప్పింది. పీఎం కిసాన్ కింద రూ. 18 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం (PM Narendra Modi Releases Rs 18,000 Crore) విడుదల చేసింది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాలో జమకానుంది. ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి యోజన్ (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) కింద దేశంలో 9 కోట్ల మంది రైతులకు (9 Crore Farmers) ఈ మొత్తం అందనుంది. ఈ సంధర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. పంట‌కు క‌ల్పించే క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌పై ప్ర‌తిప‌క్షాలు రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించే వ్య‌వ‌స్థ ఎప్ప‌టికీ ఉంటుందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలోని మెహ‌రౌలీలో జ‌రిగిన స‌భ‌లో షా మాట్లాడారు. కొత్త‌గా తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు అనుకూలంగా ఉన్నాయ‌న్నారు. ఎంఎస్‌పీ వ్య‌వ‌స్థ‌ను మార్చ‌డం లేద‌ని, రైతుల భూముల్ని ఎవ‌రూ లాక్కోవ‌డం లేద‌న్నారు. రైతు సంఘాల నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని మంత్రి అమిత్ షా తెలిపారు. కిసాన్ స‌మ్మాన్ నిధి కింద ఇవాళ ప్ర‌ధాని మోదీ సుమారు 18 వేల కోట్ల న‌గ‌దును రైతుల ఖాతాల్లోకి రిలీజ్ చేసినట్లు ఆయ‌న తెలిపారు. రైతుల సంక్షేమం కోరే వ్య‌క్తి ప్ర‌ధాని మోదీ అని షా అన్నారు.

మళ్లీ ఇంకో కొత్త వైరస్, నైజీరియాలో ఇద్దరికీ సోకిన కొత్త రకం కరోనావైరస్, ఇండియాలో తాజాగా 23,068 కరోనా కేసులు నమోదు, 336 మంది మరణంతో 1,01,46,846కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

ప్రధాని మోదీ ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధాని ఈ నిధులు అందిస్తున్నారు. ఒక్కో రైతుకు 6వేల రూపాయలు సాయం అందే ఈ పథకం కింద మూడు వాయిదాల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. సాగు భూమి ఉన్న రైతులందరికీ ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందింది. శుక్రవారం 9 కోట్ల మంది రైతులకు రూ.18,000కోట్లను బదిలీ చేశామని ప్రధాని మోదీ ప్రకటించారు