ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా లోక్‌సభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలందరికీ మార్గ నిర్దేశం చేసిందని అన్నారు. మంగళవారం సభలో కొందరు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారని పరోక్షంగా రాహుల్ గాంధీని, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మోదీ అన్నారు. అవి చూసి చాలా మంది థ్రిల్ అయ్యారని సెటైర్లు వేశారు. ఆ వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని కౌంటర్ ఇచ్చారు.
భారత్ తన సమస్యల పరిష్కారం కోసం ఒకప్పుడు ఇతరులపై ఆధారపడేదని, ఇప్పుడు భారతే ఇతరుల సమస్యలను పరిష్కరించే స్థాయికి చేరుకుందని రాష్ట్రపతి అన్నారని గుర్తు చేశారు. తాము దేశంలో అవినీతిని నిర్మూలించామని మోదీ అన్నారు. ఈ క్షణం కోసం దేశం చాలా ఏళ్లుగా ఎదురుచూసిందని పేర్కొన్నారు. వారు ఆ సమయంలో నిద్ర పోతుండవచ్చని, ఇంకా మేల్కోలేదని సెటైర్ వేశారు.
Here's ANI Tweet
I was watching yesterday. After the speeches of a few people, some people were happily saying, "Ye hui na baat." Maybe they slept well & couldn't wake up (on time). For them it has been said, "Ye keh keh ke hum dil ko behla rahe hain,wo ab chal chuke hain, wo ab aa rahe hain": PM pic.twitter.com/VVSnVUNO5x
— ANI (@ANI) February 8, 2023
నిరాశా నిస్పృహల్లో మునిగిన కొద్ది మంది దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారు. వారికి దేశ ప్రజల విజయాలు కనిపించడం లేదు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల కృషి ఫలితంగానే భారతదేశానికి పేరు వస్తోంది. వారికి ఆ విజయాలు కనిపించడం లేదని ప్రధాని మోదీ అన్నారు.
10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉంది కాబట్టి ఏదైనా మంచి జరిగినప్పుడు వారి బాధ పెరుగుతుంది. దేశ స్వాతంత్ర్య చరిత్రలో 2004-2014 స్కాములతో నిండిపోయింది. ఆ పదేళ్లలో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగాయని ప్రధాని మోదీ విమర్శించారు.
నేడు, ప్రపంచంలోని అన్ని విశ్వసనీయ సంస్థలు, ప్రపంచ ప్రభావాలను లోతుగా అధ్యయనం చేసే నిపుణులందరూ, భవిష్యత్తు కోసం అంచనాలను కూడా రూపొందించగలరు. వారంతా భారతదేశం పట్ల చాలా ఆశాజనకంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? ప్రపంచం మొత్తం భారత్ వైపు ఎందుకు ఆశగా చూస్తోందని కాంగ్రెస్ నేతలను ప్రధాని ప్రశ్నించారు.
భారతదేశం యొక్క స్థిరత్వం, దాని ప్రపంచ ఖ్యాతి, దాని పెరుగుతున్న సామర్ధ్యం. ఇక్కడ ఉత్పన్నమయ్యే కొత్త అవకాశాలలో సమాధానం దాగి ఉందని లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.