PM Narendra Modi (Photo Credits: ANI)

New Delhi, May 31: నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకంలో (PM-Kisan Scheme) భాగంగా.. 11వ విడత నిధుల్ని నేడు విడుదల చేశారు. మంగళవారం గరిబ్‌ కళ్యాణ్‌ సమ్మేళనం కోసం ప్రధాని మోదీ షిమ్లాకు వెళ్లారు. ఈ వేదికగానే ఆయన రైతుల ఖాతాలో నగదు జమ(Farmers Under PM-KISAN Scheme) చేశారు. షిమ్లాలోని రిడ్గే మైదానంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తొమ్మిది మంత్రిత్వ శాఖల ద్వారా అమలు అవుతున్న 16 పథకాల పని తీరు గురించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని స్వయంగా కొందరు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.

ఇక పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా.. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000(2 వేలు చొప్పున మూడు దఫాలుగా) అందిస్తోంది. ఏడాదికి మూడు విడతచొప్పున ఇప్పటి వరకు 10 ఇన్‌స్టాల్మెంట్లలో డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరగా, ఇవాళ 11వ విడత డబ్బులు జమ చేసింది. దాదాపు పది కోట్ల కంటే ఎక్కువ మంది రైతుల ఖాతాలో పీఎం సమ్మాన్‌ నిధి నుంచి రూ.21 వేల కోట్ల రూపాయలను (Rs 21,000 Crore to Over 10 Crore Farmers) విడుదల చేశారు.

రైతుల అకౌంట్లోకి రూ.5500, వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఏపీ సర్కారు, ఈ నెలాఖరుకు రైతుల అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలు జమ

అయితే ప్రభుత్వం నుండి పిఎం కిసాన్ పథకం ద్వారా.. దేశంలోని రైతులందరికీ గ్రాంట్లు అందవు. PM కిసాన్ పథకానికి అర్హత ప్రమాణాలు ఉన్నాయి. ముందుగానే రిజిస్టర్‌ అయ్యి ఉండాలి. అలాగే చిన్న మరియు సన్నకారు రైతులు ప్రయోజనాలను పొందుతారు. కొన్ని షరతులు వర్తిస్తాయి కూడా.

ఎలా తెలుసుకోవాలంటే..

https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx లింక్‌ను క్లిక్‌ చేయాలి.

కుడి వైపు ఆప్షన్స్‌లో బెనిఫీషియరీ(లబ్దిదారుడు) స్టేటస్‌ ఉంటుంది.

అక్కడ ఆధార్‌, అకౌంట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి గెట్‌ డేటాపై క్లిక్‌ చేయాలి

పీఎం కిసాన్‌కు రిజిస్టర్‌ చేసుకుని.. ఈ-కేవైసీ పూర్తి అయ్యి ఉంటే ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది.